Makeupతో ముడతలను ఇలా చేయొచ్చు!
ABN, First Publish Date - 2023-02-11T15:08:38+05:30
ముఖం (face) మీది ముడతలను మేకప్ (Makeup)తో దాచవచ్చు. పెదవుల దగ్గరి లాఫింగ్ లైన్స్, కళ్ల కొసల్లో తలెత్తే క్రోస్ ఫీట్‌లకు ఎలాంటి మేకప్ ట్రిక్స్ ఫాలో కావాలో తెలుసుకుందామా?
ముఖం (face) మీది ముడతలను మేకప్ (Makeup)తో దాచవచ్చు. పెదవుల దగ్గరి లాఫింగ్ లైన్స్, కళ్ల కొసల్లో తలెత్తే క్రోస్ ఫీట్‌లకు ఎలాంటి మేకప్ ట్రిక్స్ ఫాలో కావాలో తెలుసుకుందామా?
అన్నిటికంటే ముఖ్యంగా ముఖానికి మేకప్ అప్లై చేసే ముందు, ముఖాన్ని శుభ్రంగా కడిగి, ఎక్స్‌ఫోలియేట్ చేసి, టోనర్ అప్లై చేయాలి. ఆ తర్వాత స్పాట్ కరెక్టర్‌తో పోర్స్, మచ్చలను కవర్ చేయాలి. మరీ ముఖ్యంగ ముడతలను దాచేయడం కోసం...
హైల్యురోనిక్ యాసిడ్ కలిగి ఉండే హైడ్రేటింగ్ సీరమ్ అప్లై చేయాలి. దీంతో దీర్ఘకాలం పాటు చర్మం తేమగా ఉంటుంది.
విటమిన్ సి (Vitamin C), యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉండే ఐ క్రీమ్‌ను కళ్ల దిగువన అప్లై చేస్తే, కళ్ల కింది నల్లని వలయాలు, క్రోస్ ఫీట్ కనిపించకుండా ఉంటాయి.
తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇందుకోసం పెప్టైడ్ సీరమ్స్ లేదా ప్లాంట్ బేస్‌డ్ స్టెమ్ సెల్స్‌తో తయారైన మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి.
ఫేస్ ఆయిల్ (Face oil)తో మాయిశ్చరైజర్‌ను సీల్ చేయాలి. దీర్ఘకాలం పాటు చర్మం నునుపుగా కనిపించడం కోసం రెండు రకాల ఫేస్ ఆయిల్స్‌ను మిక్స్ చేసి ఉపయోగించాలి.
తర్వాత సన్ ప్రొటెక్షన్ (Sun protection) కోసం, ముడతలను దాచేయడం కోసం మంచి ఎస్‌పిఎఫ్ కలిగిన సన్‌స్ర్కీన్ అప్లై చేయాలి.
సిలికాన్ బేస్‌డ్ ప్రైమర్
దీంతో చర్మం (Skin) మీద గీతలు ముడుతలు, గుంతలు కనిపించకుండా పోతాయి. ఇవి సాధారణ ప్రైమర్ల కంటే ఖరీదైనవే అయినప్పటికీ, మరింత మందంగా ఉండి, ముడతలను దాచేస్తాయి. ప్రైమర్లు చర్మానికి ఒక షీల్డ్‌లా పని చేసి, రూజ్, బ్లష్, ఐ షాడోల్లోని రసాయనాల నుంచి రక్షణ కూడా కల్పిస్తాయి.
ఇది కూడా చదవండి: Shocking Incident: భర్త బైక్‌ను ఎక్కిందో మహిళ.. మార్గమధ్యంలో ఆమె అడిగిన ఒక్క మాటతో..
మేకప్ ఉత్పత్తులు
ముడతలను దాచేయడం కోసం మన్నికైన మేకప్ ఉత్పత్తులనే ఎంచుకోవాలి. ప్రత్యేకించి చర్మపు రకాన్ని బట్టి మేకప్ ఉత్పత్తులను ఎంచుకోవాలి. అందుకోసం..
ముడతల్లో ఇరుక్కుపోయే మందపాటి ఫౌండేషన్ బదులుగా లైట్ ఫౌండేషన్ ఎంచుకోవాలి.
ఫౌండేషన్ (Foundation)కు ముఖానికి రుద్దుకోకుండా ముఖమంతా అద్దుకుని మెత్తని ఫౌండేషన్ అప్లికేటర్ బ్రష్‌తో ముఖమంతా సమంగా పరుచుకోవాలి.
బ్యూటీ బ్లెండర్‌ను గోరువెచ్చని నీళ్లలో ముంచి ముఖమంతా అద్దుకోవాలి. ముక్కుకు ఇరువైపులా కళ్ల దిగువన, ముడతలు పడే వీలున్న ప్రదేశాల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి.
విటమిన్ ఇ కలిగి ఉండే తేలికపాటి కన్‌సీలర్‌తో కళ్ల కింది వలయాలను కవర్ చేయాలి.
కళ్ల చివర్లలో డో టిప్ బ్రష్‌ను ఉపయోగించాలి.
చర్మం యవ్వనంగా కనిపించడం కోసం షిఫాన్ కలర్ కరెక్టర్‌ను అప్లై చేయాలి.
చివర్లో హైలైటర్లు, బ్లష్, ఐ మేకప్, లిప్ కలర్ అప్లై చేసుకుని, అంతిమంగా సెట్టింగ్ పౌడర్లు, స్ర్పేలు ఉపయోగించాలి.
Updated Date - 2023-02-11T15:08:39+05:30 IST