ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Beijing Floods : 140 ఏళ్లలో ఎరుగని వరదలతో బీజింగ్ విలవిల

ABN, First Publish Date - 2023-08-03T12:34:06+05:30

చైనా రాజధాని నగరం బీజింగ్ 140 ఏళ్లలో ఎరుగని వరద బీభత్సంతో అల్లకల్లోలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షాలు మునుపెన్నడూ లేనంత విధ్వంసాన్ని సృష్టించాయి. దీంతో అధికారులు పెద్ద ఎత్తున పునరావాస, పునరుద్ధరణ చర్యలు ప్రారంభించారు. ఆదివారం భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

బీజింగ్ : చైనా రాజధాని నగరం బీజింగ్ 140 ఏళ్లలో ఎరుగని వరద బీభత్సంతో అల్లకల్లోలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షాలు మునుపెన్నడూ లేనంత విధ్వంసాన్ని సృష్టించాయి. దీంతో అధికారులు పెద్ద ఎత్తున పునరావాస, పునరుద్ధరణ చర్యలు ప్రారంభించారు. ఆదివారం భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

చైనాలోని అత్యధిక ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. బీజింగ్, దాని పొరుగున ఉన్న పట్టణాల్లోని హై రిస్క్ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 140 ఏళ్లలో ఎరుగనంత తీవ్ర స్థాయిలో జల ప్రళయం సంభవించిందని బీజింగ్ వాతావరణ శాఖ తెలిపింది. చాంగ్‌పింగ్‌లో వాంగ్జియాయువాన్ జలాశయం పరిసర ప్రాంతంలో రికార్డు స్థాయిలో 744.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. 1891లో కురిసిన రికార్డు స్థాయి వర్షపాతం 609 మిల్లీమీటర్లు అని, ఈ రికార్డు ఇప్పుడు బద్దలైందని వెల్లడించింది.

బీజింగ్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సుమారు 12 మంది జాడ తెలియడం లేదు. వరదలు బుధవారంనాటికి పొరుగున ఉన్న హెబెయి ప్రావిన్స్‌కు మారాయి. హెబెయిలోని గువాన్ కౌంటీలో నీటి మట్టం రికార్డు స్థాయికి చేరింది.


ఈ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ, సహాయ, పునరావాస కార్యకలాపాలు నిరంతరం జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో సహాయక చర్యలు చేపట్టడం కోసం అదనంగా లైటింగ్ ఫెసిలిటీస్ అందజేయాలని అధికారులు కోరుతున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున నిర్వాసితులయ్యారు. హెబెయి ప్రావిన్స్‌లో దాదాపు 8,50,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు.

సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా వేగంగా ప్రవహిస్తున్న నదిలో ప్రయాణిస్తున్న రబ్బర్ పడవ బోల్తా పడింది. దీనిలో ఉన్న సహాయక సిబ్బందిలో వాంగ్ హాంగ్-చున్ (41) అనే మహిళా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దీనిలో ప్రయాణిస్తున్న సహాయక సిబ్బందిలో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.

ఇదిలావుండగా, ఈ జల ప్రళయం సృష్టించిన విధ్వంసం తాలూకు ఫొటోలు సామాజిక మాధ్యమాలను ముంచెత్తుతున్నాయి. శనివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు 170 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపిందని, జూలై నెల మొత్తం వర్షపాతంతో ఇది సమానమని ఓ నెటిజన్ తెలిపారు.


ఇవి కూడా చదవండి :

Haryana clashes : హర్యానాలో మత ఘర్షణలు.. ప్రశాంతంగా ఉండాలన్న అమెరికా..

Gyanvapi : జ్ఞానవాపి మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి

Updated Date - 2023-08-03T13:07:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising