ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mushrooms Crime Story: ఫ్యూజులు ఎగిరిపోయే క్రైమ్ స్టోరీ.. ఆ ఇంట్లో తిన్న వెంటనే ముగ్గురు ఢమాల్.. అసలేం జరిగిందంటే?

ABN, First Publish Date - 2023-08-11T15:27:58+05:30

క్రైమ్ త్రిల్లర్ సినిమాల్లో మరణాలు ఎలా సంభవిస్తుంటాయో మొదట్లో రివీల్ చేయరు. అసలు ఎలా చనిపోతున్నారు? ఎవరు ఈ హత్యలు చేస్తున్నారు? అనే సంగతులు చివరిదాకా మిస్టరీగానే ఉంటాయి. అయితే.. చివర్లో మాత్రం ఆ మిస్టరీలు రివీల్ అవుతాయి. కానీ..

క్రైమ్ త్రిల్లర్ సినిమాల్లో మరణాలు ఎలా సంభవిస్తుంటాయో మొదట్లో రివీల్ చేయరు. అసలు ఎలా చనిపోతున్నారు? ఎవరు ఈ హత్యలు చేస్తున్నారు? అనే సంగతులు చివరిదాకా మిస్టరీగానే ఉంటాయి. అయితే.. చివర్లో మాత్రం ఆ మిస్టరీలు రివీల్ అవుతాయి. కానీ.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్రైమ్ స్టోరీలో మాత్రం మిస్టరీలు అన్‌సాల్వ్డ్‌గానే ఉన్నాయి. ఒక ఇంట్లో ఆహారం చేసిన తర్వాత ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడగా, మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారు ఎలా చనిపోయారన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఎలాంటి ఆధారాలు దొరకడం లేదు. భోజనంలో విషం కలిపారా? అంటే, అలాంటి ఆనవాళ్లూ దొరకలేదు. ఏ కోణంలో విచారణ చేపట్టినా, చిక్కుముడి వీడకపోతుండటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఆస్ట్రేలియాలో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..


ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం లియోంగథా పట్టణంలో ఎరిన్ పాటర్సన్ అనే 48 మహిళ నివసిస్తోంది. ఈమె జులై 29వ తేదీన తన అత్తమామలైన గెయిల్, డాన్ పాటర్సన్ (ఇద్దరిదీ వయసు 70 ఏళ్లు)లను విందుకు ఆహ్వానించింది. ఆ ఇద్దరితో పాటు గెయిల్ సోదరి హీతర్ విల్కిన్సన్, ఆమె భర్త ఇయాన్ విల్కిన్సన్ కూడా ఈ విందుకు విచ్చేశారు. ఈ నలుగురికి ఎరిన్ పుట్టగొడుగులతో చేసిన ఆహార వంటకాల్ని వడ్డించింది. అది చాలా రుచికరంగా ఉండటంతో.. అందరూ కడుపారా తిన్నారు. అంతే, ఆ కాసేపటికే వాళ్లు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు. తొలుత గ్యాస్ట్రో సమస్య తలెత్తి ఉంటుందని భావించారు. దీంతో.. ఆ నలుగురిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే.. అక్కడ వారి ఆరోగ్యం మెరుగపడకపోవడంతో, మెరుగైన వైద్యం కోసం మెల్‌బోర్న్‌లోని ఆసుపత్రికి తరలించారు. కానీ.. అప్పటికే ఆలస్యం అయ్యింది. గెయిల్, డాన్, హీతర్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. ఇయాన్ ఇంకా చికిత్స పొందుతున్నాడు.

ఆ ముగ్గురు మరణించిన సంగతి తెలుసుకొని పోలీసులు రంగంలోకి దింపారు. వాళ్లు ఎలా చనిపోయారన్న మిస్టరీని ఛేధించే పనిలో నిమగ్నమయ్యారు. వీళ్లందరూ ఎరిన్ పాటర్సన్ ఇంట్లో భోజనం చేశాక అస్వస్థతకు గురయ్యారు కాబట్టి.. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. తానేమీ చేయలేదని, వాళ్లను తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని, వారి చావు తనని తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఎరిన్‌కి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు లభ్యం కాకపోవడంతో.. పోలీసులు ఆమెని వదిలేశారు. కానీ, ఆమెపై ఓ కన్నేసి ఉంచారు. మరోవైపు.. ఈ కేసుని విచారిస్తున్న ఓ అధికారి మాట్లాడుతూ.. ఆ ముగ్గురి మరణం వెనుక ఏదో కుట్ర ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉందని, సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నామన్నారు. ఆమె వంటకాల్లో ఎలాంటి పుట్టగొడుగులు వేసిందో తేల్చే పనిలో ఉన్నామన్నారు.

Updated Date - 2023-08-11T15:27:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising