ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Russia: ఆ హక్కు అమెరికాకు లేదు.. అగ్రరాజ్యంపై నిప్పులు చెరిగిన రష్యా

ABN, First Publish Date - 2023-09-14T22:49:35+05:30

అమెరికా, రష్యా మధ్య ఎప్పటి నుంచో పచ్చిగడ్డ వేస్తే భగ్గుమనేంత శతృత్వం ఉంది. ఆధిపత్యం కోసం ఈ రెండు దేశాలు పోటీ పడుతూనే ఉన్నాయి. అందుకే.. బాహాటంగానే ఈ ఇరుదేశాలు పరస్పర విమర్శలు...

అమెరికా, రష్యా మధ్య ఎప్పటి నుంచో పచ్చిగడ్డ వేస్తే భగ్గుమనేంత శతృత్వం ఉంది. ఆధిపత్యం కోసం ఈ రెండు దేశాలు పోటీ పడుతూనే ఉన్నాయి. అందుకే.. బాహాటంగానే ఈ ఇరుదేశాలు పరస్పర విమర్శలు చేసుకుంటాయి. ఒకరిపై మరొకరు అగ్గిమీద గుగ్గిలమవుతూ ఉంటాయి. ఇప్పుడు ఓ విషయంలో రష్యా అగ్రరాజ్యం అమెరికాపై నిప్పులు చెరిగింది. తమకు నీతులు చెప్పొద్దంటూ ఘాటుగా స్పందించింది. పదండి, రష్యా ఎందుకిలా రియాక్ట్ అయ్యిందో మేటర్‌లోకి వెళ్లి తెలుసుకుందాం..


ఇటీవల ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశమైన విషయం తెలిసిందే. కిమ్ రైలులో రష్యాకు వెళ్లి మరీ పుతిన్‌ని కలిశారు. గంటల తరబడి సమావేశాలు జరిపిన వీరి మధ్య కొన్ని కీలక విషయాలపై చర్చలు సాగినట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా.. సైనిక సహకారం, ఆయుధాల సరఫరా వంటి విషయాలపై పుతిన్, కిమ్ మధ్య చర్చలు జరిగాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కిమ్ తెలిపారు. అంతేకాదు.. రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలను సైతం అందించనుందని తెలిసింది. ఈ విషయంపై అమెరికా, దక్షిణ కొరియాతో పాటు పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

ఈ నేపథ్యంలోనే అమెరికాలోని ఉన్న రష్యా రాయబారి అనాటోలీ ఆంటోనోవ్ ఘాటుగా స్పందించారు. ఎలా జీవించాలన్న విషయంపై మాకు ఉపన్యాసం ఇచ్చే హక్కు అమెరికాకు ఏమాత్రం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఆసియాలో అమెరికా కొన్ని దేశాలతో బంధాన్ని ఏర్పరచుకోవడంతో పాటు వేల కోట్ల డాలర్ల విలువైన ఆయుధాల్ని ఉక్రెయిన్‌కి అందించిందన్నారు. ఉత్తర కొరియా సమీపంలో సైనిక కసరత్తు సైతం అమెరికా చేసిందని ఆరోపించారు. తన ఆర్థిక ఆంక్షలను చెత్త కుప్పలోకి విసిరే సమయం వాషింగ్టన్‌కు ఆసన్నమైందన్నారు. అమెరికా అధికారులకు ఇకపై ఏకధృవ ఆధిపత్యాన్ని కొనసాగించడం సాధ్యం కాదని చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-09-14T22:49:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising