ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Israel- Hamas War: ఇజ్రాయెల్‌కు షాక్ ఇచ్చిన అమెరికా.. గాజాను ఆక్రమించడం పెద్ద తప్పు: బైడెన్

ABN, First Publish Date - 2023-10-16T12:06:05+05:30

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చిన అమెరికా ఇప్పుడు సడంగా మాట మార్చింది.

వాషింగ్టన్: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చిన అమెరికా ఇప్పుడు సడంగా మాట మార్చింది. గాజాపై ఇజ్రాయెల్ దళాలు భూదాడులకు సిద్ధమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆ దేశానికి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. హమాస్-పాలిత భూభాగాన్ని తిరిగి ఆక్రమించకుండా ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇచ్చారు. గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించుకోవాలనుకోవడం ‘పెద్ద తప్పు’ అని చెప్పారు. సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైడెన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ పూర్తి స్థాయి ఆక్రమణకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. "ఇది చాలా పెద్ద తప్పు అని నేను భావిస్తున్నాను. నా దృష్టిలో గాజాలో ఏం జరుగుతుందంటే అక్కడి పాలస్తీనా ప్రజలందరికీ హమాస్ ఉగ్రవాద సంస్థ ప్రాతినిధ్యం వహించదు. కాబట్టి గాజాను ఇజ్రాయెల్ తిరిగి ఆక్రమించుకుంటే పెద్ద తప్పే అవుతుంది.’’ అని బిడెన్ అన్నారు. అయినప్పటికీ గాజాలోని ఉగ్రవాదులను ఏరిపారేయడం ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. అయితే ఇజ్రాయెల్ యుద్ధ నియమాలకు వ్యతిరేకంగా ముందుకు వెళ్లదని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు. "ఇజ్రాయెల్ యుద్ధ నిబంధనల ప్రకారం పనిచేస్తుందని నాకు నమ్మకం ఉంది" అని బిడెన్ తెలిపారు. దీంతో ఇన్నాళ్లు తమకు మద్దతిచ్చిన అమెరికా ఇప్పుడు మాట మార్చడంతో ఇజ్రాయెల్‌కు పెద్ద షాక్ తగిలిందనే చెప్పుకోవాలి.


కాగా ఇజ్రాయెల్- హమాస్ యుద్దంలో అమెరికా మొదట ఇజ్రాయెల్‌కే మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండించిన అమెరికా ఆ దేశానికి అన్ని విధాల సాయం చేస్తామని హామీ కూడా ఇచ్చింది. అన్నట్టుగానే సాధ్యమైన మేర యుద్ధానికి అవసరమైన ఆయుధ సామగ్రిని పంపించింది. కానీ తాజాగా గాజాపై ఇజ్రాయెల్ భూదాడులకు సిద్ధమవుతున్న తరుణంలో మనసు మార్చుకుంది. గాజాలో ఇజ్రాయెల్ భూఆక్రమణలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. మరోవైపు ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదుల దాడుల కారణంగా ఇప్పటివరకు మొత్తం 1,400 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో కనీసం 30 మంది అమెరికా పౌరులున్నారు. బైడెన్ పరిపాలన విభాగంలోని సీనియర్ అధికారి ఒకరు అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్ పర్యటనకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణ ప్రణాళికలు ఇంకా ఖరారు కానప్పటికీ, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానం తర్వాత చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

మరోవైపు గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను నిర్వహిస్తుంది. గాజా ఇప్పటివరకు చూడని అత్యంత తీవ్రమైన బాంబు దాడులను చేస్తోంది. భూ ఆక్రమణలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే గాజాకు ఇజ్రాయెల్ నీరు, విద్యుత్, వస్తువులు, ఇంధనం, ఆహార సరఫరాలను నిలిపివేసింది. దీంతో ప్రస్తుతం గాజా అంధకారంలోకి వెళ్లింది. మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ప్రాణనష్టం గణనీయంగా పెరిగింది. మరణాల సంఖ్య సోమవారం నాటికి 4,000 దాటింది. హమాస్ దాడుల కారణంగా ఇజ్రాయెల్‌లో 1,400 మంది చనిపోయారు. గాజాలో 2,670 మంది పాలస్తీనియన్లు మరణించగా.. 9,600 మంది గాయపడ్డారని అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు పాలస్తీనా గ్రూప్ హమాస్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడులు ప్రారంభించినప్పటిని నుంచి ఉత్తర గాజా స్ట్రిప్‌లో ఒక మిలియన్ ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇజ్రాయెల్ హెచ్చరికలతో వారంతా సురక్షిత మార్గాల ద్వారా తప్పించుకున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి అధికారికంగా ప్రకటించింది. కాగా గాజా మొత్తంలో నివసించే జనాభాలో ఉత్తర గాజాలోనే దాదాపు సగం మంది నివసిస్తున్నారు. గాజా మొత్తంలో 2.4 మిలియన్ల జనాభా ఉండగా.. ఉత్తర గాజాలోనే 1.1 మిలియన్ల మంది నివసిస్తున్నారు.

Updated Date - 2023-10-16T12:06:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising