ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India-Canada Row: కెనడాకు మరో కొరడా.. దెబ్బ అదుర్స్ కదూ.. భారత్‌తో పెట్టుకుంటే అంతే!

ABN, First Publish Date - 2023-09-29T16:32:50+05:30

తనకు అగ్రరాజ్యాల అండ ఉందనో లేక తనకు ఆర్థిక బలం ఉందనో లేక అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటని అహంకారమో తెలీదు కానీ.. కెనడా మాత్రం అనవసరంగా భారత్‌తో కయ్యానికి కాలు దువ్వింది. ఖలిస్తానీ ఉగ్రవాది...

తనకు అగ్రరాజ్యాల అండ ఉందనో లేక తనకు ఆర్థిక బలం ఉందనో లేక అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటని అహంకారమో తెలీదు కానీ.. కెనడా మాత్రం అనవసరంగా భారత్‌తో కయ్యానికి కాలు దువ్వింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై నిరాధార ఆరోపణలు చేసి అభాసుపాలు అవుతోంది. తాను కాల్చిన బుల్లెట్ మిస్‌ఫైర్ అయ్యింది. తనకు మద్దతుగా ప్రపంచం వస్తుందని కెనడా భావిస్తే.. అందుకు భిన్నంగా అది విమర్శలు మూటగట్టుకుంటోంది. ఇప్పటికే భారత్‌కి మద్దతుగా కొన్ని దేశాలు దిగొచ్చి.. కెనడాకు మొట్టికాయలు వేశాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా కెనడాపై కొరడా ఝుళపించింది. ఇప్పటికే ఆ దేశంతో తమ సంబంధాలు దెబ్బతిన్నాయని కుండబద్దలు కొట్టింది.


ఒక ఇంటర్వ్యూలో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఎకే అబ్దుల్ మోమెన్ మాట్లాడుతూ కెనడాపై విరుచుకుపడ్డారు. కెనడా దేశం హంతకుల డెన్‌గా మారిందని బాంబ్ పేల్చారు. హంతకులందరూ కెనడాలో నివసించకపోవచ్చు కానీ.. అక్కడ హంతకులు విజృంభించే వాతావరణం ఉందని ఆరోపణలు చేశారు. హంతకులు అక్కడికి వెళ్లి మంచి జీవితాన్ని గడుపుతున్నారని.. దాని పర్యవసానాలను బాధిత కుటుంబాలు అనుభవిస్తున్నాయని పేర్కొన్నారు. బంగ్లాదేశ్, కెనడా మధ్య సంబంధాలు కూడా బాగా లేవని.. ఎందుకంటే బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబ్ రెహమాన్ హత్యకు పాల్పడిన నిందితుడు నూర్ చౌదరి ఆ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని మండిపడ్డారు. భారత్‌తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయన్న ఆయన.. కెనడాతోనూ మంచి సంబంధాలను కొనసాగిస్తామని తెలిపారు. నూర్ చౌదరిని అప్పగిస్తే, ఆ దేశంతో సంబంధాలు బలపడతాయన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తపరిచారు.

నూర్ చౌదరి కెనడాలో మంచి జీవితాన్ని గడుపుతున్నాడని.. ఆ హంతకుడ్ని తమకు అప్పగించాలని కెనడా ప్రభుత్వానికి తాము పదే పదే అభ్యర్థిస్తున్నామని అబ్దుల్ మోమెన్ చెప్పారు. కానీ.. అతడ్ని అప్పగించకుండా కెనడా రకరకాల సాకుతు చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అతడు కెనడియన్ పౌరుడా? కాదా? అని తాము తెలుసుకోవాలని అనుకుంటున్నామని అన్నారు. కెనడా న్యాయవ్యవస్థని నమ్ముతుంది కానీ, హంతకులందరూ అక్కడికే వెళ్లి మకాం వేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై కెనడా తమ మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు.. కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలపై అబ్దుల్ స్పందిస్తూ భారత్ అలాంటి పనులు (నిజ్జర్ హత్య) చేయదన్నారు. భారత్, కెనడా మధ్య నెలకొన్న దౌత్య వివాదం విచారకరమైందని, ఇది స్నేహపూర్వకంగా ముగుస్తుందని ఆశిస్తున్నానని అభిప్రాయపడ్డారు.

Updated Date - 2023-09-29T16:32:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising