bird flu: చీలీలో మనుషుల్లో మొట్టమొదటి బర్డ్ ఫ్లూ కేసు
ABN, First Publish Date - 2023-03-30T08:01:50+05:30
ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మనుషుల్లో బర్డ్ ఫ్లూ కేసు వెలుగుచూసింది....
శాంటియాగో(చీలీ): ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మనుషుల్లో బర్డ్ ఫ్లూ కేసు వెలుగుచూసింది. చిలీ దేశంలో మనుషుల్లో బర్డ్ ఫ్లూ మొట్టమొదటి కేసును గుర్తించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.చీలీ దేశంలో 53 ఏళ్ల వ్యక్తిలో తీవ్రమైన ఇన్ఫ్లుఎంజా లక్షణాలు కనిపించాయని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన రోగితో కలిసి ఉన్న వారిని కూడా వైద్యులు పరిశీలిస్తున్నారు. చిలీ దేశంలోని జంతువుల్లో గత సంవత్సరం హెచ్ 5 ఎన్1 బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.చిలీ దేశ పారిశ్రామిక క్షేత్రాల్లో ప్రభుత్వం పౌల్ట్రీ ఎగుమతులను నిలిపివేసింది.
ఇది కూడా చదవండి : Pope Francis: పోప్ ఫ్రాన్సిస్‌కు శ్వాసకోశ సమస్యలు...ఆసుపత్రిలో చేరిక
బర్డ్ ఫ్లూ వైరస్ పక్షులు లేదా సముద్రపు క్షీరదాల నుంచి మనుషులకు సంక్రమించవచ్చు. కాని మనిషి నుంచి మనిషికి బర్డ్ ఫ్లూ సంక్రమిస్తుందని చిలీ ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు.ఈక్వెడార్ లో 9 ఏళ్ల బాలికకు బర్డ్ ఫ్లూ సంక్రమించింది. బర్డ్ ఫ్లూ వ్యాధి మనుషుల మధ్య సంక్రమించే ప్రమాదం తక్కువగా ఉందని గ్లోబల్ హెల్త్ అధికారులు చెప్పారు. వ్యాక్సిన్ తయారీదారులు మనుషులకు బర్డ్ ఫ్లూ సోకకుండా వ్యాక్సిన్లను సిద్ధం చేస్తున్నారు.
Updated Date - 2023-03-30T08:01:50+05:30 IST