Earthquake: 149కి చేరిన భూకంప మృతుల సంఖ్య.. 2 లక్షలకు పైగా ఇళ్లు ధ్వంసం
ABN, Publish Date - Dec 25 , 2023 | 08:24 AM
China Earthquake: వారం రోజుల క్రితం చైనాలో సంభవించిన భూకంపం భారీగా ప్రాణ, ఆస్తి నష్టం మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 149కి పెరిగింది.
వారం రోజుల క్రితం చైనాలో సంభవించిన భూకంపం భారీగా ప్రాణ, ఆస్తి నష్టం మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 149కి పెరిగింది. ఈ ప్రకృతి విపత్తులో ఇద్దరు వ్యక్తులు కనిపించకుండాపోయారు. గన్సు, కింగ్ హై ప్రావిన్సుల్లో 10 కిలో మీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం కారణంగా 2 క్షలకుపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. 15 వేల ఇళ్లు కుప్పకూలిపోయాయి. దీంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. భూకంప కేంద్రం తక్కువ లోతులో ఉండడం వల్లనే భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు చెబుతున్నారు.
ధ్వంసమైన ఇళ్లలో అత్యధికం మట్టి-చెక్క లేదా ఇటుక-చెక్కతో నిర్మించినవి. ఈ ఇళ్ల భారాన్ని మోసే గోడలు భూమి నుంచే నిర్మించారు. కాబట్టి ఎలాంటి భూకంపం వచ్చినా వాటి రక్షణ బలహీనంగా ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. అలాగే గ్రామాల్లో నిర్మించిన గృహాల్లో భూకంప నిరోధకతను పెంచాల్సిన అవశ్యకతను వారు తెలిపారు. కాగా చైనాలోని టెక్టోనికల్ యాక్టివ్ కింగ్ హై-టిబెటన్ పీఠభూమి ఈశాన్య సరిహద్దులోని ప్రావిన్సులలో భూకంపాలు సర్వసాధారణం. పదేళ్ల క్రితం సిచువాన్‌లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 6,700 మందికి పైగా గాయపడ్డారు. 160 మందికి పైగా మరణించారు. 2010లో కింగ్‌హైలోని టిబెటన్ ప్రాంతమైన యుషులో 7.1 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 2,700 మంది మరణించారు.
Updated Date - Dec 25 , 2023 | 08:24 AM