ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nikki Haley: చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది, ఎలాంటి తప్పులు చేయొద్దు.. నిక్కీ హేలీ హెచ్చరికలు

ABN, First Publish Date - 2023-09-23T18:49:57+05:30

రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఇండియన్-అమెరికన్ నిక్కీ హేలీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాను అస్తిత్వ ముప్పుగా అభివర్ణించిన ఆమె.. ఆ దేశం యుద్ధానికి సిద్ధమవుతోందని..

రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఇండియన్-అమెరికన్ నిక్కీ హేలీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాను అస్తిత్వ ముప్పుగా అభివర్ణించిన ఆమె.. ఆ దేశం యుద్ధానికి సిద్ధమవుతోందని పేర్కొన్నారు. అమెరికాను ఓడించడం కోసం చైనా అర్థశతాబ్ద కాలం పాటు పన్నాగం పన్నిందని.. కొన్ని అంశాల్లో చైనా సైన్యం ఇప్పటికే అమెరికా సాయుధ బలగాలతో సమానంగా ఉందని ఆమె కుండబద్దలు కొట్టారు. అమెరికాపై విజయం సాధించేందుకు చైనా యుద్ధానికి రెడీ అవుతోందని, ఎలాంటి తప్పులు చేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

శుక్రవారం న్యూహ్యాంప్ షైర్‌లో ఆర్థిక వ్యవస్థపై నిక్కీ హేలీ ప్రసంగిస్తూ.. అమెరికా జాతీయ మనుగడకు బలంతో పాటు ఆత్మాభిమానం చాలా అవసరమని, యూఎస్‌కి డ్రాగన్ కంట్రీ చైనా నుంచి ప్రమాదం పొంచి ఉందని అన్నారు. ఇప్పటికే అమెరికా వాణిజ్య రహస్యాలను చైనా సొంతం చేసుకుందని.. మెడిసిన్స్ నుంచి అధునాతన సాంకేతికత వరకు ప్రధాన పరిశ్రమలను తన ఆధీనంలోకి తీసుకుందని పేర్కొన్నారు. కేవలం కొంత కాలంలోనే.. ఆర్థికంగా వెనుకబడిన దేశం నుండి భూమిపై రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు చైనా అవతరించిందని చెప్పారు. తానెప్పుడూ అగ్రస్థానంలోనే ఉండాలని చైనా కోరుకుంటోందని అన్నారు.

అమెరికా, ఆసియాతో పాటు ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు భారీ మిలిటరీని చైనా నిర్మిస్తోందని నిక్కీ హేలీ వెల్లడించారు. కొన్ని అంశాల్లో చైనా సైన్యం ఇప్పటికే అమెరికా సాయుధ దళాలతో సమానంగా ఉందని.. ఇతర ప్రాంతాల్లో వాళ్లు తమకన్నా పైచేయి సాధించారని పేర్కొన్నారు. చైనా లీడర్లు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారంటే.. వాళ్లు మన (అమెరికా) ఆకాశంలోకి స్పై బెలూన్స్ పంపుతున్నారని.. క్యూబా తీరంలో గూఢచారి స్థావరాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. కమ్యూనిస్ట్ పార్టీ (చైనా) యుద్ధానికి సిద్ధం అవుతోందని.. చైనా నాయకులకు గెలవాలని భావిస్తున్నారని, కాబట్టి తప్పులు చేయొద్దని సూచించారు.


అనంతరం నిక్కీ హేలీ తన ఆర్థిక ప్రణాళికను పంచుకున్నారు. మధ్యతరగతి అమెరికన్లకు నిజమైన ఉపశమనాన్ని, ఆర్థిక స్వేచ్ఛను అందించడం.. తన ప్రణాళికల్లో ఉందని తెలిపారు. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి వేల డాలర్ల పన్ను రాయితీ లభిస్తుందని హామీ ఇచ్చారు. తాము ఫెడరల్ గ్యాస్, డీజిల్ పన్నును పూర్తిగా తొలిస్తామన్నారు. తద్వారా.. గ్యాస్‌పై గ్యాలన్‌కు 18 సెంట్లు, డీజిల్‌పై 24 సెంట్లు ఆదా అవుతుందని.. ఇది గ్యాస్ ధరలతో పోరాడుతున్న కుటుంబాలకు సహాయం చేస్తుందని అన్నారు. రోడ్లకు నిధులు ఇవ్వడానికి ఫెడరల్ గ్యాస్ టాక్స్ అవసరం లేదని.. వాషింగ్టన్‌లో ట్రిలియన్ల కొద్దీ రోడ్లను నిర్మించడం కొనసాగిస్తామన్నారు.

తాను అధ్యక్షురాలిగా ఎన్నికైతే.. శ్రామిక కుటుంబాలకు ఆదాయపు పన్నును కూడా తగ్గిస్తానని హేలీ మాటిచ్చారు. అధ్యక్షుడు జో బిడెన్ చేపట్టిన 500 బిలియన్ డాలర్ల గ్రీన్ ఎనర్జీ సబ్సిడీలను సైతం తాను తొలగిస్తానని హామీ ఇచ్చారు. దీంతో.. శత్రు దేశాలకు (చైనా) తమ దేశం నుంచి ఆర్థిక ద్వారాలు మూసుకుపోతాయన్నారు. మహమ్మారి సమయంలో భారీ ఖర్చులు వెచ్చించారని.. ఇప్పుడు ప్యాండెమిక్ ముగిసింది కాబట్టి ఆ స్థాయిలో ఖర్చులు ఉండవని తెలిపారు. తాను అధికారంలోకి వస్తే.. రాజకీయ నాయకుల తరహాలోనే బ్యూరోక్రాట్లను కూడా పరిమితం చేస్తామని, ఏ బ్యూరోక్రాట్ కూడా ఐదేళ్లకు మించి ఒకే పదవిలో ఉండకూడదని నిక్కీ హేలీ చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-09-23T18:49:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising