ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Donald Trump: వివేక్ రామస్వామి అందుకు తగిన వ్యక్తే.. ప్రశంసల వర్షం కురిపించిన డొనాల్డ్ ట్రంప్

ABN, First Publish Date - 2023-08-31T16:08:05+05:30

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రిపబ్లికన్ల అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ముందంజలో ఉన్న వివేక్‌ రామస్వామిపై ప్రశంసల వర్షం కురిపించారు. వివేక్ చాలా తెలివైన వ్యక్తి అని..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రిపబ్లికన్ల అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ముందంజలో ఉన్న వివేక్‌ రామస్వామిపై ప్రశంసల వర్షం కురిపించారు. వివేక్ చాలా తెలివైన వ్యక్తి అని.. ఉపాధ్యక్షుడిగా అతను బలమైన వ్యక్తి కాగలడని.. అతనిలో శక్తివంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని కొనియాడారు. ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘వివేక్ ఎంతో చురుకైన వ్యక్తి. అతనిలో ట్యాలెంట్ ఎంతో ఉంది. అతనికి మంచి మేధాశక్తి ఉంది. అతను ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటాడు. నన్నడిగితే.. అతనొక మంచి వ్యక్తి అని చెప్పగలను. అతను ఉపాధ్యక్ష పదవికి తగిన వ్యక్తి అని నేను భావిస్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. తాను అతనిలాగే ఉండాలని అనుకుంటున్నానన్నారు.


కాగా.. ఆగస్టు 23వ తేదీన రిపబ్లికన్‌ పార్టీ తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్ జరగ్గా, అందులో ట్రంప్ పాల్గొనలేదు. ఈ కార్యక్రమంలో వివేక్‌ రామస్వామి, నిక్కీ హేలీ వంటి ఆశావహులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ట్రంప్‌ను 21వ శతాబ్దపు ఉత్తమ అధ్యక్షుడిగా వివేక్ అభివర్ణించారు. దీనిపై ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో వివేక్‌కి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు.. డిబేట్‌లో అతడు నిజాయితీగా వాస్తవాల్ని చెప్పడం వల్లే వివేక్ భారీ విజయం సాధించినట్లు తాను భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు.

ఇదిలావుండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు 8 మంది రిపబ్లిక్ అభ్యర్థులు పోటీ పడుతుండగా, వారిలో వివేక్ రామస్వామి అగ్రస్థానంలో నిలిచారు. భారత సంతతికి చెందిన వివేక్.. ఉక్రెయిన్ యుద్ధం, డొనాల్డ్ ట్రంప్, వాతావరణ మార్పులపై వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ట్రంప్‌తో పోటీ పడేందుకు కూడా వివేక్ ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైతే మాత్రం.. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉండటానికి వివేక్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కానీ.. ట్రంప్‌పై కేసులు, ఇతర కారణాల వల్ల అధ్యక్ష పోటీలో ఆయన చివరి వరకు నిలుస్తారా? లేదా? అన్నది సందేహంగా మారింది.

Updated Date - 2023-08-31T16:08:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising