ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nepal : నేపాల్‌లో అర్ధరాత్రి భారీ భూకంపం.. 69 మంది మృతి

ABN, First Publish Date - 2023-11-04T07:22:58+05:30

నేపాల్ దేశంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. నేపాల్ దేశంలోని జాజర్ కోట్ జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంపం కారణంగా సంభవించిన భారీ భూకంపం వల్ల 69 మంది మరణించారు.

ఖాట్మండు : నేపాల్ దేశంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. నేపాల్ దేశంలోని జాజర్ కోట్ జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంపం కారణంగా సంభవించిన భారీ భూకంపం వల్ల 69 మంది మరణించారు. వందల సంఖ్యలో జనం గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. జాజర్ కోట్ జిల్లాలో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి.

భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత నేపాల్ హోం మంత్రిత్వ శాఖ 24 మృతదేహాలను వెలికితీసింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైందని అధికారులు చెప్పారు. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాలు అంధకారంగా మారిపోయాయి. కాగా.. ఈ భూకంప తీవ్రతకు భారత్‌లోని పలు ప్రాంతాలు సైతం కంపించాయి. నేపాల్‌కు 800 కి.మీ దూరంలో ఉన్న ఢిల్లీతో పాటు యూపీ, బిహార్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఢిల్లీలోని ప్రజలు ఏం జరుగుతుందో తెలియక రోడ్లపైకి పరుగులు తీశారు.

Updated Date - 2023-11-04T07:23:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising