Indonesia: తానింబర్‌లో భారీ భూకంపం...సునామీ ముప్పు లేదు
ABN, First Publish Date - 2023-01-10T07:29:30+05:30
ఇండోనేషియా దేశంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది....
తానింబర్ (ఇండోనేషియా): ఇండోనేషియా దేశంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది.(Earthquake) తానింబర్(Tanimbar) ప్రాంతంలో మంగళవారం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్(European Mediterranean Seismological Centre) ట్వీట్ చేసింది. ఇండోనేషియాలోని(Indonesia) టువల్ ప్రాంతానికి నైరుతి దిశలో 342 కిలోమీటర్ల దూరంలో మంగళవారం తెల్లవారుజామున భూకంపం వచ్చింది. ఆస్ట్రేలియా, తైమూర్ లెస్టే, ఇండోనేషియాలలో సుమారు 14 మిలియన్ల మంది ప్రజలు భూప్రకంపనల బారిన పడ్డారు. ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు లేదని శాస్త్రవేత్తలు చెప్పారు.
ఈ భూకంపం తర్వాత మరిన్ని భూకంపాలు సంభవించవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ కోరింది. ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్‌లో 5.6 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా కనీసం 318 మంది మరణించారు.పశ్చిమ జావాలోని సియాంజూర్ ప్రాంతంలో మధ్యాహ్నం 1:21 గంటలకు 5.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
Updated Date - 2023-01-10T07:31:42+05:30 IST