ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Elon Musk with Benjamin Netanyahu:ఎలాన్ మస్క్‌తో సైబర్ ట్రక్కులో బెంజమిన్ జర్నీ.. వైరలవుతోన్న వీడియో

ABN, First Publish Date - 2023-09-19T16:53:14+05:30

ఇజ్రాయెల్(Israeli) ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ఇటీవల అమెరికాలో పర్యటించారు. అందులో భాగంగా ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్‌(Elon Musk)ని కలిశాడు. అయితే వారికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మస్క్ టెస్లా(Tesla) కంపెనీ తయారు చేసిన సైబర్‌ట్రక్‌(Cyber Truck)లో బెంజమిన్, అతని భార్యతో కలిసి టెస్ట్ డ్రైవ్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని అధికారిక X అకౌంట్ వీడియోను షేర్ చేసింది.

ఇజ్రాయెల్(Israeli) ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ఇటీవల అమెరికాలో పర్యటించారు. అందులో భాగంగా ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్‌(Elon Musk)ని కలిశాడు. అయితే వారికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మస్క్ టెస్లా(Tesla) కంపెనీ తయారు చేసిన సైబర్‌ట్రక్‌(Cyber Truck)లో బెంజమిన్, అతని భార్యతో కలిసి టెస్ట్ డ్రైవ్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని అధికారిక X అకౌంట్ వీడియోను షేర్ చేసింది. "ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అతని భార్య సారా కాలిఫోర్నియా ఫ్రీమాంట్‌లోని @టెస్లా మోటార్స్ ప్లాంట్‌లో టెస్లా CEO, వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తో కలిసి పర్యటించారు" అని ఎక్స్ అకౌంట్ లో రాశారు. మస్క్ అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, వాటి పనితీరును ప్రధాని పరిశీలించారని అధికారులు తెలిపారు. ఈ ట్వీట్ పై విశేష స్పందన వస్తోంది.


టెస్లా సైబర్‌ ట్రక్ విశేషాలివే..

టెస్లా 2019లోనే తన సైబర్ ట్రక్ మోడల్ ని ఆవిష్కరించింది. దీని ఫీచర్లు పబ్లిక్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇది అద్భుతమైన రాడికల్ డిజైన్ కలిగి ఉంటుంద. దీని బాడీ అల్ట్రా హార్డ్ 30 ఎక్స్ కోల్డ్ రోల్డ్ స్టెయిన్‌లెస్ స్టీల్(Stainless Steel) తో తయారు చేసి ఉంటుంది. 9 మి.మీ. మందం కలిగిన బుల్లెట్లను సైతం తట్టుకోగలదని టెస్లా తెలిపింది. దీని టాప్ స్పీడ్ 402 కి.మీ. వరకు ఉంటుందని, 3 వేల 400 కిలోల బరువును లాగగలదని వెల్లడించింది. సైబర్‌ ట్రక్‌ ధర అమెరికా(US)లో బేస్ వేరియంట్ ధర 39 వేల 900 డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 32.72 లక్షలు) మిడ్ వేరియంట్ ధర 49 వేల 900 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 40.92 లక్షలు). టాప్ స్పెక్ వేరియంట్ ధర 69 వేల 900 డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 57.32 లక్షలు) వరకు ఉంటుంది. ఈ పికప్ ట్రక్కు ఇండియా(India)లో ఎప్పుడు విడుదలవుతుందనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

Updated Date - 2023-09-19T16:53:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising