ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

America: మీ ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది.. ఖలిస్థానీలను హెచ్చరించిన ఎఫ్‌బీఐ

ABN, First Publish Date - 2023-09-24T11:55:02+05:30

కెనడా: ఖలిస్తానీ(Khalistan) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్యతో కెనడాలోని ఖలిస్థానీలకు ప్రమాదం పొంచి ఉందని అమెరికాలోని ఎఫ్‌బీఐ(FBI) హెచ్చరించింది.

కెనడా: ఖలిస్తానీ(Khalistan) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్యతో కెనడాలోని ఖలిస్థానీలకు ప్రమాదం పొంచి ఉందని అమెరికాలోని ఎఫ్‌బీఐ(FBI) హెచ్చరించింది. వారు ప్రస్తుతం మ‌ృత్యువు నీడలో ఉన్నారని వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించి ఓ నివేదిక విడుదల కాగా అందులో సంచలన విషయాలు బయటకి వచ్చాయి. నిషేధిత ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్(KTF) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ ని జూన్ 18న కెనడాలోని సర్రేలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ హత్యే కెనడా(Canada), భారత్ కి మధ్య రాజకీయ వైరాన్ని రాజేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudo) ఈ హత్య వెనక భారత్ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ గొడవ చినికి చినికి గాలి వానలా మారింది. కెనడా ఆరోపణలను భారత్ ఖండించింది.


అమెరికన్ సిక్కు కాకస్ కమిటీ కోఆర్డినేటర్ ప్రీత్ పాల్ సింగ్ ది ఇంటర్‌సెప్ట్‌తో మాట్లాడుతూ.. కాలిఫోర్నియా(Caliphornia)లోని ఇద్దరు సిక్కు అమెరికన్లకు(Americans) నిజ్జర్ హత్య తర్వాత FBI నుండి కాల్స్, మెసేజ్ లు వచ్చాయని చెప్పారు. ఆ సిక్కు అమెరికన్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆ మెసేజ్ లలో ఉందని ప్రీత్ పాల్ సింగ్ చెప్పారు. నిజ్జర్ హత్యకు ముందు తమకు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ బృందాలు తనను హెచ్చరించినట్లు బ్రిటిష్ కొలంబియా గురుద్వారా కౌన్సిల్ ప్రతినిధి మహీందర్ సింగ్ చెప్పారు. అవే బృందాలు నిజ్జర్ ని సైతం హెచ్చరించినట్లు వివరించారు. భారత్ గతంలోనే నిజ్జర్ ని ఉగ్రవాదిగా గుర్తించి అతడ్ని పట్టిస్తే రూ.10 లక్షల రివార్డు అందజేస్తామని స్పష్టం చేసింది. అలాంటి వ్యక్తికి కెనడా భద్రత పెంచడం వివాదానికి దారి తీసింది. చండీగఢ్, అమృత్‌సర్‌లోని సిక్కు ఫర్ జస్టిస్ (SFJ) US ఆధారిత ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆస్తుల్ని NIA శనివారం సీజ్ చేసింది.

Updated Date - 2023-09-24T11:55:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising