ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Joe Biden: హమాస్ & రష్యా రెండూ ఒకటే.. ప్రజాస్వామ్యాల్ని నాశనం చేయడమే వాటి లక్ష్యం.. జో బైడెన్ సంచలనం

ABN, First Publish Date - 2023-10-20T18:52:18+05:30

అమెరికా, రష్యా.. కొన్ని దశాబ్దాల నుంచి వీటి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం కొనసాగుతోంది. అన్నింటిలోనూ తమదే పైచేయి ఉండాలని, తామే ఆధిపత్యం చెలాయించాలన్న కాంక్షే.. ఈ రెండు దేశాల మధ్య చిచ్చు రగిల్చింది.

అమెరికా, రష్యా.. కొన్ని దశాబ్దాల నుంచి వీటి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం కొనసాగుతోంది. అన్నింటిలోనూ తమదే పైచేయి ఉండాలని, తామే ఆధిపత్యం చెలాయించాలన్న కాంక్షే.. ఈ రెండు దేశాల మధ్య చిచ్చు రగిల్చింది. అందుకే.. ఈ రెండు దేశాలు పరస్పర విమర్శలు చేసుకుంటూ ఉంటాయి. నిందలు వేయడానికి ఏ ఒక్క అవకాశం దొరికినా సరే.. అస్సలు వదులుకోరు. ఇప్పుడు హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో.. అమెరికా, రష్యాలు పరస్పర విమర్శలకు దిగాయి. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా అమలు చేస్తున్న విధానాల వల్లే ఈ యుద్ధం జరుగుతోందని ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపణలు చేశారు.

ఆ వ్యాఖ్యలకు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హమాస్‌తో కలిపి రష్యాపై సంచలన ఆరోపణలు చేశారు. హమాస్, రష్యా ఒకటేనని.. ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేయడమే వాటి లక్ష్యమంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. గురువారం రాత్రి ఓవల్‌ ఆఫీసు నుంచి దేశ ప్రజలనుద్దేశిస్తూ ఆయన చేసిన ప్రసంగంలో ఆ వ్యాఖ్యలు చేశారు. హమాస్‌, రష్యా వేర్వేరు విధాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నా.. ఒక విషయంలో మాత్రం ఆ రెండింటి ఎజెండా ఒకటేనని అన్నారు. పొరుగున ఉన్న ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే ఆ రెండింటి లక్ష్యమని దుయ్యబట్టారు. ఆ రెండింటి నుంచి ప్రమాదాలను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడం.. అమెరికా ప్రయోజనాలకు కీలకమని స్పష్టం చేశారు. తమని తాము కాపాడుకోవడం కోసం యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌కు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని మరోసారి క్లారిటీ ఇచ్చారు.


జో బైడెన్ మాట్లాడుతూ.. ‘‘ఓ గొప్ప దేశంగా మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలకు చిన్నపాటి రాజకీయ విభేదాలు అడ్డు కాకూడదు. హమాస్‌ లాంటి ఉగ్రవాదులు, పుతిన్‌ లాంటి నియంత శక్తులను మనం ఏమాత్రం గెలవనివ్వకూడదు. హమాస్‌, పుతిన్‌ పాల్పడే బెదిరింపులు బిన్నమైనవి కావొచ్చు కానీ.. పొరుగు ప్రజాస్వామ్యాల్ని నాశనం చేయాలన్నదే వారి ఎజెండా మాత్రం ఒక్కటే. ఇలాంటి దురాక్రమణలు కొనసాగితే.. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఆ ఘర్షణలు వ్యాపిస్తాయి. నేను అలా జరగనివ్వను. అమెరికా నాయకత్వం ప్రపంచాన్ని ఏకతాటిపై నిలిపింది. మిత్రదేశాల వల్లే అమెరికా సురక్షితంగా ఉంటుంది. మన విలువలు, విధానాల వల్లే భాగస్వాములు మనతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రమాదంలో ఉన్న ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌కు సహాయం చేయకుండా వెన్నుపోటు పొడిస్తే.. అమెరికా విలువలు, విధానాలన్నీ ప్రమాదంలో పడినట్లే. అది ఏమాత్రం సరేంది కాదు’’ అని చెప్పుకొచ్చారు.

ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌కు సహాయం చేయడానికి భారీ నిధులను ఆమోదించాలని తాను కాంగ్రెస్‌ను కోరానని అన్నారు. ఈ సహాయం భవిష్యత్తులో అమెరికన్ల భద్రతకు మూలం అవుతుందని, గ్లోబల్ లీడర్‌గా అమెరికా ఎదిగేందుకు సహాయపడుతుందని వ్యాఖ్యానించారు. ఒక రకంగా ఈ సహాయం ఓ పెట్టుబడి లాంటిదని ఆయన వివరించారు. ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌తో పాటు తైవాన్‌కి కూడా ఆర్థిక-మానవతా సహాయం, సరిహద్దుల నిర్వహణ కోసం 100 బిలియన్‌ డాలర్ల ఫండింగ్‌ ప్యాకేజీ ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2023-10-20T18:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising