ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Worms Raining : చైనాలో మరో వైపరీత్యం... జనం ఎలా తప్పించుకుంటున్నారంటే...

ABN, First Publish Date - 2023-03-11T17:37:17+05:30

సామాజిక మాధ్యమాల్లో కనిపించిన వీడియోలను అనేక మీడియా సంస్థలు పోస్ట్ చేశాయి. బీజింగ్ రోడ్లకు ఇరువైపులా పార్క్ చేసిన వాహనాలు మట్టి రంగులో

Worms on cars
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బీజింగ్ : చైనా (China) రాజధాని నగరం బీజింగ్ (Beijing)లో పురుగుల వర్షం పడింది. ఆరుబయట తిరిగే ప్రజలు, రోడ్లపై ప్రయాణించే వాహనాలు వానపాముల వంటి మట్టి రంగు పురుగులమయం అయిపోయాయి. వీటి నుంచి తప్పించుకోవడం కోసం ప్రజలు గొడుగులు వేసుకోవలసి వచ్చింది. ఈ విచిత్రానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయని అమెరికన్ మీడియా వెల్లడించింది.

సామాజిక మాధ్యమాల్లో కనిపించిన వీడియోలను అనేక మీడియా సంస్థలు పోస్ట్ చేశాయి. బీజింగ్ రోడ్లకు ఇరువైపులా పార్క్ చేసిన వాహనాలు మట్టి రంగులో ఉన్న, దుమ్ము, ధూళితో కనిపిస్తున్న చిన్న చిన్న పురుగులతో నిండిపోవడం ఈ వీడియోల్లో కనిపించింది. ఆకాశం నుంచి రాలుతున్న ఈ పురుగుల నుంచి తప్పించుకోవడం కోసం ప్రజలు గొడుగులు వేసుకుని నడవడం కనిపించింది.

ఓ సైంటిఫిక్ జర్నల్ తెలిపిన వివరాల ప్రకారం, భారీ గాలులు నేలపైనున్న పురుగులను లాక్కెళ్ళడం వల్ల ఆకాశం నుంచి అవి పడుతున్నట్లు అవుతోందని తెలుస్తోంది. సాధారణంగా తుపాను వెలిసిపోయినపుడు ఇలా జరుగుతుందని తెలుస్తోంది.

ఇదిలావుండగా, షేన్ షివేయి అనే చైనీస్ పాత్రికేయుడు ఇచ్చిన ట్వీట్‌లో ఇదంతా బూటకమని చెప్పారు. తాను బీజింగ్‌లోనే ఉన్నానని, ఇటీవలి కాలంలో బీజింగ్‌లో వర్షాలు కురవలేదని తెలిపారు. ఇది ఫేక్ వీడియో అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

CBI Vs RJD : తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు... సీఎం నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు...

Infosys Vs Tech Mahindra: ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా ఉద్యోగులకు బిగ్ న్యూసే ఇది!

Updated Date - 2023-03-11T17:37:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising