ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Potholes : రోడ్లపై గుంతల్లో నూడుల్స్‌తో స్టంట్స్ చేస్తున్న మిస్టర్ పాట్‌హోల్

ABN, First Publish Date - 2023-03-31T12:45:17+05:30

రోడ్లపై గుంతలు ఉంటే వాహనదారులు, పాదచారులు ఎన్ని అవస్థలు పడతారో అందరికీ తెలుసు. వీటిని పూడ్చాలని

Mark Morell, Britain
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

లండన్ : రోడ్లపై గుంతలు ఉంటే వాహనదారులు, పాదచారులు ఎన్ని అవస్థలు పడతారో అందరికీ తెలుసు. వీటిని పూడ్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రయత్నిస్తారు. బ్రిటన్‌కు చెందిన మార్క్ మోరెల్ (Mark Morell) కూడా పదేళ్ళ నుంచి ఇదే పనిలో ఉన్నారు. ఆయనను అందరూ ‘మిస్టర్ పాట్‌హోల్’ (Mr Pothole) అని పిలుచుకుంటారు.

బ్రిటన్‌లోని రోడ్లు సక్రమంగా లేకపోవడాన్ని చూసి మార్క్ మోరెల్ తీవ్ర ఆవేదనకు గురవుతుంటారు. రోడ్లను మరమ్మతు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం ఆయన రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. నీరు నిండిన గుంతల్లో రబ్బరు బాతులను వదలడం, గుంతల పుట్టిన రోజునాడు వాటికి కేక్ తినిపించడం, నమూనా జలాంతర్గాములను వదలడం, చేపలను పట్టే కొక్కేలను పెట్టడం వంటి పనులు చేసేవారు. కానీ ఇవేవీ ఆయన కోరుకున్న ఫలితాలను రాబట్టలేకపోయాయి. బ్రిటన్ రోడ్ల దుస్థితిని అందరి దృష్టికి తేవడం కోసం ఆయన పాట్ నూడుల్స్ అనే కంపెనీ సహకారాన్ని పొందారు. గుంతలను పూడ్చడానికి పాట్ నూడుల్స్ కన్నా మించినవేవీ లేవని ఆయన చెప్తున్నారు.

రోడ్లపై గుంతల వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, ఇది అత్యంత ఆవేదన కలిగించే సమస్య అని మార్క్ మోరెల్ చెప్పారు. వీటిని పూడ్చాలని, రోడ్లను సరైన విధంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలని తాను పదేళ్ళ నుంచి ప్రచారం చేస్తున్నానని తెలిపారు. ఈ సమస్యకు ఇప్పటికీ పరిష్కారం దొరకడం లేదని, అందువల్ల తాను నూడుల్స్‌తో స్టంట్స్ చేస్తూ ప్రజలకు, అధికారులకు అవగాహన కల్పిస్తున్నానని చెప్పారు.

రోడ్లపై గుంతల వల్ల ప్రాణాలు కోల్పోయిన సైకిలిస్టుల కుటుంబ సభ్యులను తాను కలిశానని చెప్పారు. కనీసం వారానికి ఒక సైకిలిస్ట్ ప్రాణాలు కోల్పోవడం కానీ, జీవితం మారిపోయే స్థాయిలో గాయపడటం కానీ జరుగుతోందన్నారు. ఈ దారుణాలు నివారించదగినవేనని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Delhi Shastri Park: మస్కిటో కాయిల్ పొగ ఇంత డేంజరా.. పాపం.. ఒకే కుటుంబంలో ఆరుగురు చనిపోయారు..!

Digvijaya Vs Kapil : దిగ్విజయ సింగ్‌పై కపిల్ సిబల్ ఆగ్రహం

Updated Date - 2023-03-31T12:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising