ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NIA: ఖలిస్థాన్ ఉగ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ ఆస్తులు స్వాధీనం

ABN, First Publish Date - 2023-09-23T17:34:00+05:30

ఖలిస్థాన్ అనుకూలవాద ఉగ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ కు చెందిన ఉగ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ ఆస్తులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శనివారంనాడు దాడులు చేసింది. పన్నూకు చెందిన ఛండీగఢ్, అమృత్‌సర్‌లోని ఆస్తులను స్వాధీనం చేసుకుంది.

న్యూఢిల్లీ: ఖలిస్థాన్ అనుకూలవాద ఉగ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (SJF)కు చెందిన ఉగ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannu) ఆస్తులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) శనివారంనాడు దాడులు చేసింది. పన్నూకు చెందిన ఛండీగఢ్, అమృత్‌సర్‌లోని ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఎన్ఐఏ తాజా చర్యతో ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ఆస్తులపై పన్నూకు ఎలాంటి హక్కులు ఉండవు. ఈ ఆస్తులు ఇకనుంచి ప్రభుత్వ అధీనంలోకి వెళ్తాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక సవరణ చట్టం (UAPA)లోని 4వ షెడ్యూల్ కింద 'స్వతంత్ర ఉగ్రవాది' (Individual Terrorist)గా ప్రకటించిన పన్నూపై ఇప్పటికే పలు ఏజెన్సీలు కేసులు నమోదు చేశాయి.


ఎన్ఐఏ మోహాలి కోర్టు ఉత్తర్వుల మేరకు జలంధర్ జిల్లా భార్సింగ్ పుర గ్రామంలో ఖలిస్థాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు చెందిన నివాసం వెలుపల 'ఆస్తి స్వాధీనం' నోటీసును అంటించారు. కాగా, ఇండియాలో నిషేధ సంస్థగా ఉన్న ఎస్‌జేఎఫ్‌కు చీఫ్‌గా కెనడాకు చెందిన పన్నూ వ్యవహరిస్తుండటంతో చట్టవ్యతిరేక కార్యకలాపాల కింద ఆయనను వాండెడ్ టెర్రరిస్టుగా 2020లో ప్రకటించారు. పంజాబ్‌లో ఆయనపై 20కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ సహా పలువురు భారతీయ నేతలకు పన్నూ గతంలో పలుమార్లు హెచ్చరికలు జారీచేశారు.


పంజాబ్‌ను స్వతంత్ర, సార్వభౌమాధికార దేశంగా ప్రకటించాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు, బహిరంగంగానే భారతదేశ ప్రాదేశిక సమగ్రత, సౌర్వభౌమత్వాన్ని సవాలు చేస్తూ ఎస్‌జేఎఫ్‌ ఏర్పడింది. ఈ సంస్థపై 2019 జూలై 10న కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిషేధం విధిం

Updated Date - 2023-09-23T17:56:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising