Imran Khan: తోషఖానా కేసులో హైకోర్టు ఏమి చెప్పిందంటే..?
ABN, First Publish Date - 2023-05-12T12:31:20+05:30
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు తోషఖానా కేసులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ఇస్లామాబాద్ హైకోర్టు ) స్టే మంజూరు చేసింది. తనను ముందస్తు అరెస్టు చేయకుండా బెయిలు కోరుతున్న ఇమ్రాన్ ఖాన్‌ను భారీ భద్రత మధ్య శుక్రవారంనాడు కోర్టు ముందు హాజరుపరిచారు. కేసుపై విచారణ జరిపిన కోర్టు స్టే మంజూరు చేసింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ (PTI) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు తోషఖానా (Toshakhana) కేసులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ఇస్లామాబాద్ హైకోర్టు (IHC) స్టే మంజూరు చేసింది. తనను ముందస్తు అరెస్టు చేయకుండా బెయిలు కోరుతున్న ఇమ్రాన్ ఖాన్‌ను భారీ భద్రత మధ్య శుక్రవారంనాడు కోర్టు ముందు హాజరుపరిచారు. కేసుపై విచారణ జరిపిన కోర్టు స్టే మంజూరు చేసింది. దీనికి ముందు రోజే, ఇమ్రాన్ అరెస్టు చట్టవిరుద్ధమని పాకిస్థాన్ సుప్రీంకోర్టు పేర్కొంది.
కాగా, ఈనెల 9న అల్-ఖదిర్ ట్రస్టు కేసులో అవినీతి ఆరోపణలపై దర్యాప్తునకు నేషనల్ అకౌంటబుల్ బ్యూరో ఆదేశించడంతో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేశారు. ఆయన అరెస్టును ఐహెచ్‌సీ సమర్ధించగా, సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అవినీతి నిరోధక విభాగం ఇమ్రాన్‌ను చట్టవిరుద్ధంగా అరెస్టు చేసిందని, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ప్రాంగణంలో ఎవరినీ అరెస్టు చేయడానికి వీలులేదన్న కోర్టు.. దేశంలో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నామని పేర్కొంది. ఇమ్రాన్ ఖాన్ ను శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టుకు హాజరు కావాలని, ఆ న్యాయస్థానం నిర్ణయానికి అనుగుణంగా వెళ్లాలని సూచించింది.
తోషఖానా కేసు ఏమిటి?
విదేశీ ప్రతినిధుల నుంచి వచ్చే కానులక ఖజానాను తోషిఖానా అంటారు. ప్రభుత్వ అధికారులకు వచ్చే కానుకలను అందులో ఉంచుతారు. ఇమ్రాన్ ప్రధాని అయిన తర్వాత తనకు వచ్చిన కానుకలు ఏమిటనేవి చెప్పడానికి నిరకరించడమే కాకుండా, ఎంతో కొంత ధర ఇచ్చిన తోషఖానా నుంచి వాటిని తీసుకునేందుకు, తిరిగి అమ్ముకునేందుకు అనుమతించాలని ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు. ఇమ్రాన్ తనకు వచ్చిన కానుకల్లో 10 కోట్ల విలివైన వాటికి 2 కోట్లు చెల్లించి తీసుకున్నారని నివేదికలు వచ్చాయి. మూడు వాచీలు అమ్ముకున్నారని కూడా నివేదిక పేర్కొంది. 2022లో తోషఖానా వివాదంపై ఆయనపై కేసు నమోదైంది. ఎంతో కొంత ధర చెల్లించి తన సొంతం చేసుకున్నారని, అయినప్పటికీ అనైతకంగా ఆ పని చేస్తూ తప్పుదారి పట్టించే ప్రకటనలు చేశారంటూ ఆయనపై ఎన్నికల్లో పోటీ చేయకుండా ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.
Updated Date - 2023-05-12T12:31:20+05:30 IST