Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌పై మరో వేటుకు రంగం సిద్ధం?
ABN, First Publish Date - 2023-03-19T12:33:40+05:30
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) నేతృత్వంలోని పాకిస్థాన్ తెహరీక్-ఈ-ఇన్సాఫ్ (PTI) రాజకీయ
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) నేతృత్వంలోని పాకిస్థాన్ తెహరీక్-ఈ-ఇన్సాఫ్ (PTI) రాజకీయ పార్టీపై త్వరలో నిషేధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాహోర్‌లోని ఆయన నివాసంలో ఆయుధాలు, తుపాకులు, పెట్రోలు బాంబులు దొరికాయని చెప్తూ ఆ పార్టీపై నిషేధం విధించబోతున్నట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ ఇంటీరియర్ మినిస్టర్ రాణా సనావుల్లా (Rana Sanaullah)ను ఉటంకిస్తూ పాకిస్థానీ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) ప్రభుత్వం పీటీఐ పార్టీని నిషేధించే అంశంపై నిపుణులను సంప్రదిస్తోంది. లాహోర్‌లోని ఇమ్రాన్ నివాసంలో ఆయుధాలు, తుపాకులు, పెట్రోలు బాంబులు దొరికినందువల్ల ఈ నిర్ణయం తీసుకుంది.
ఇమ్రాన్ ఖాన్ ఓ కేసులో కోర్టు విచారణకు హాజరయ్యేందుకు శనివారం లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వెళ్లారు. ఆ సమయంలో 10,000 మందికిపైగా సాయుధ పంజాబ్ పోలీసులు ఆయన నివాసంలోకి వెళ్లారు. పదుల సంఖ్యలో ఉన్న ఆయన మద్దతుదారులను అరెస్ట్ చేశారు.
మంత్రి సనావుల్లా మీడియాతో మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్ నివాసంలో ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారన్నారు. ఆయన నివాసం నుంచి ఆయుధాలు, పెట్రోలు బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఉగ్రవాద సంస్థగా వ్యవహరిస్తున్న పీటీఐపై కేసు నమోదు చేసేందుకు ఇది తగిన సాక్ష్యాధారమని చెప్పారు. ఏ రాజకీయ పార్టీనైనా నిషేధించడమనేది న్యాయ ప్రక్రియ అని, అయితే తాము న్యాయ నిపుణులను సంప్రదిస్తామని చెప్పారు.
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Pakistan Prime Minister Shehbaz Sharif) మాట్లాడుతూ, ఎవరికి ఏ సందేహం ఉన్నప్పటికీ, పీటీఐ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ గత కొన్ని రోజుల నుంచి చేస్తున్న పనులు, చెప్తున్న మాటలు ఆయన ఫాసిస్ట్, మిలిటెంట్ ధోరణులను బయటపెట్టాయన్నారు.
ఇవి కూడా చదవండి :
Punjab : అమృత్‌పాల్ సింగ్ పాకిస్థానీ ఐఎస్ఐ ఏజెంట్ : నిఘా వర్గాలు
Rahul Gandhi : రాహుల్ గాంధీ నివాసానికి పోలీసు దళాలు... ‘భారత్ జోడో యాత్ర’లో ప్రసంగం చిచ్చు...
Updated Date - 2023-03-19T12:33:40+05:30 IST