ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Prince Harry-Afghanistan: 25 మందిని చంపా.. బ్రిటన్ రాకుమారుడు హ్యారీ వ్యాఖ్య..

ABN, First Publish Date - 2023-01-06T18:40:41+05:30

బ్రిటన్ రాకుమారుడు హ్యారీ ఆత్మకథ ‘స్పేర్‌’లోని మరో ఆసక్తికర అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: ఈ నెల 10న విడుదల కానున్న బ్రిటన్(Britain) రాకుమారుడు హ్యారీ(Prince Harry) ఆత్మకథ ‘స్పేర్‌’లోని(Spare) మరో ఆసక్తికర అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. సైన్యంలో ఉన్నప్పుడు తాను అఫ్ఘానిస్థాన్‌లో(Afghanistan) తాలిబన్లపై(Taliban) పోరాడానని ప్రిన్స్ హ్యారీ తన పుస్తకంలో చెప్పుకొచ్చారు. ఆ సమయంలో 25 మంది చంపానని పేర్కొన్నారు. తాలిబన్లను మనుషులుగా చూడొద్దని ఆర్మీ అధికారులు తనకు నేర్పినట్టు వివరించారు. వారిని చదరంగంలో పావులుగా చూడాలన్న విషయం మనసులో నాటుకునేలా శిక్షణ ఇచ్చారన్నారు. అయితే.. తాలిబన్లను మట్టుపెట్టడం తనకు గర్వకారణమో లేదా తలవంపులో కాదని స్పష్టం చేశారు.

గతంలో ప్రిన్స్ హ్యారీ ‘అపాచీ’ యుద్ధ హెలికాఫ్టర్‌కు పైలట్‌గా వ్యవహరించారు. అఫ్ఘానిస్థాన్‌లో రెండో టూర్ సందర్భంగా ఆరు మిషన్లలో పాల్గొని 25 మంది ముష్కరులను ఆయన మట్టుపెట్టారు. ‘‘తాలిబన్ల విషయంలో నేను సరైన నిర్ణయం తీసుకున్నానన్న నమ్మకంతో రోజు ముగించాలి ఇదే నా లక్ష్యం’’ అని తన పుస్తకంలో రాసుకొచ్చారు. మేఘన్‌తో ప్రేమ, పెళ్లి, రాజకుటుంబం నుంచి వేరుపడటం తదితర అంశాలను ప్రిన్స్ హ్యారీ తన పుస్తకంలో చేర్చారు. మేఘన్ విషయంలో ప్రిన్స్ విలియం తన తమ్ముడు హ్యారితో గొడవపడి అతడి కాలర్ పట్టుకున్నారన్న వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది.

Updated Date - 2023-01-06T18:43:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising