ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Canada: హిందూ ఆలయం తలుపులపై ఖలిస్థాన్ అనుకూల పోస్టర్లు

ABN, First Publish Date - 2023-08-13T16:24:58+05:30

కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉన్న అతి పురాతన ఆలయమైన లక్ష్మీనారాయణ్ మందిరం తలుపులపై ఖలిస్థాన్ అనుకూలవాదులు స్టర్లు అతికించటం కలకలం రేపింది. జూన్ 18న జరిగిన హత్యలో భారతదేశ పాత్రపై విచారణ జరిపాలంటూ ఆ పోస్టర్లలో రాసి ఉంది. హర్దీప్ సింగ్ నజ్జర్ ఫోటో ఈ పోస్టర్లలో ముద్రించి ఉంది.

అటావా: కెనడా (Canaa) లోని బ్రాంప్టన్‌లో ఉన్న అతి పురాతన ఆలయమైన లక్ష్మీనారాయణ్ మందిరం తలుపులపై ఖలిస్థాన్ అనుకూలవాదులు (Pro-Khalistan) పోస్టర్లు (Posters) అతికించటం కలకలం రేపింది. జూన్ 18న జరిగిన హత్యలో భారతదేశ పాత్రపై విచారణ జరిపాలంటూ ఆ పోస్టర్లలో రాసి ఉంది. హర్దీప్ సింగ్ నజ్జర్ (Hardeep Singh Najjar) ఫోటో ఈ పోస్టర్లలో ముద్రించి ఉంది.


ఖలిస్థాన్ ఉద్యమంలో చురుకుగా పనిచేస్తున్న నజ్జర్‌ను జూన్ 19న కెనడాలోని సరేలో అగంతకులు కాల్చిచంపారు. పంజాబీలు అత్యధిక సంఖ్యలో ఉన్న సరే సిటీలో ఇద్దరు సాయుధులు నజ్జర్‌ను మట్టుబెట్టినట్టు కథనాలు వెలువడ్డాయి. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే)ను భారత ప్రభుత్వం 2019లో నిషేధించింది. ఈ వేర్పాటువాద సంస్థతో నజ్జర్ సంబంధాలు సాగిస్తూ వచ్చారు. పంజాబ్‌లో పలు ఉగ్రవాద కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకున్న భారత ప్రభుత్వం నజ్జర్‌పై చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను గతంలో కోరింది.


కాగా, లక్ష్మీ నారాయణ్ మందిరం తలుపులపై పోస్టర్లు అతికించిన ఘటన సీసీటీవీలో రికార్డయింది. మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఆలయ ఆవరణలోకి చొరబడి, ఆలయం తలపులపై ఖలిస్తాన్ అనుకూల పోస్టర్లు అంటించినట్టు ఈ ఫుటేజ్‌లో ఉంది. ఆలయంలో ఖలిస్థాన్ అనుకూల కార్యక్రమాలు చూసి తాను దిగ్భ్రాంతికి గురైనట్టు టెంపుల్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ కుమార్ తెలిపారు.

Updated Date - 2023-08-13T16:30:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising