ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Russia Wagner: పుతిన్ పెద్ద తప్పు చేశారు.. తీవ్ర హెచ్చరిక చేసిన వాగ్నర్ చీఫ్ ప్రిగొజిన్.. ఏమన్నారంటే..

ABN, First Publish Date - 2023-06-24T18:12:32+05:30

రష్యా సైనిక నాయకత్వాన్ని పడగొడతానంటూ తిరుగుబావుటా ఎగురువేసిన కిరాయి సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ చీఫ్ ప్రిగొజిన్.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. తనపై తిరుగుబాటుదారు, దేశద్రోహి అని నిందలు వేసి అధ్యక్షుడు పుతిన్ తీవ్రమైన తప్పు చేశారని హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: రష్యా సైనిక నాయకత్వాన్ని పడగొడతానంటూ తిరుగుబావుటా ఎగురువేసిన కిరాయి సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ చీఫ్ ప్రిగొజిన్.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. తనపై తిరుగుబాటుదారు, దేశద్రోహి అని నిందలు వేసి అధ్యక్షుడు పుతిన్ తీవ్రమైన తప్పు చేశారని హెచ్చరించారు. కిరాయి గ్రూపే అయినప్పటికీ తన ఫైటర్లు దేశభక్తులని వ్యాఖ్యానించారు. ‘మాతృభూమికి నమ్మకద్రోహం’ చేశారని పుతిన్ వ్యాఖ్యానించడం పెద్ద తప్పిదమని అన్నారు. ఈ మేరకు ఆయన ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. కాగా వాగ్నర్ ఫైటర్లు ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి రష్యాలోకి ప్రవేశించారని రిపోర్టులు వెలువడుతున్నాయి. ఇప్పటికే రెండు నగరాలను ఆక్రమించుకోగా.. మరిన్ని నగరాలను ఆక్రమించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. ప్రస్తుతం రోస్తావ్ నగరం దిశగా కదులుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

రష్యాకు ఊహించని షాక్..

ఉక్రెయిన్‌పై యుద్ధకాండను కొనసాగిస్తున్న రష్యాకు కలలో కూడా ఊహించని పరిణామం ఎదురైంది. ఉక్రెయిన్‌పై నిర్విరామ యుద్ధంలో రష్యాకు మద్ధతుగా పోరాడుతున్న కిరాయి సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ (Wagner Group) తిరుగుబావుటా ఎగురవేసింది. రష్యన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అవసరమైన అన్ని అడుగులు వేస్తామని ప్రకటించింది. ఈ మేరకు వాగ్నర్ గ్రూప్ అధిపతి యెవ్జెన్సీ ప్రిగొజిన్ (Yevgeny Prigozhin) నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి లీకయిన ఆడియో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉలిక్కిపాటుకు గురిచేస్తోంది. ప్రిగొజిన్ ‘సాయుధ తిరుగుబాటుదారుడు’ అంటూ రష్యా అభివర్ణించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కాగా వాగ్నర్ గ్రూప్ (అధికారికంగా పీఎంసీ వాగ్నర్) అనేది ఒక ప్రైవేటు మిలిటరీ ఆర్గనైజేషన్.

కాగా వాగ్నర్ గ్రూప్ (అధికారికంగా పీఎంసీ వాగ్నర్) అనేది ఒక ప్రైవేటు మిలిటరీ ఆర్గనైజేషన్. దీనిని యెవ్జెన్సీ ప్రిగొజిన్ నిర్వహిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలను కూడా ఆయనే చూసుకుంటున్నారు. ప్రిగొజిన్ ప్రస్తుత వయసు 61 సంవత్సరాలు. గతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి చెఫ్ (Cheff) గా పనిచేశారు. తన క్యాటరింగ్ బిజినెస్‌తో ప్రభుత్వ కార్యక్రమాల్లో క్యాటరింగ్ నిర్వహించేవాడు.

వాగ్నర్ గ్రూపును తొలిసారి 2014లో గుర్తించారు. ఆ సమయంలో తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల విభజన బలగాలకు మద్దతుగా ఉంది. అప్పటివరకు ఈ గ్రూప్ సీక్రెట్‌గా ఆపరేషన్లు నిర్వహిస్తూ వచ్చింది. ఎక్కువగా ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండేది. అప్పట్లో రష్యా ఉన్నతవర్గాలు, ప్రత్యేక దళాలకు చెందిన 5000లకుపైగా ఫైటర్లు ఇందులో పనిచేస్తున్నారని ఒక అంచనాగా ఉంది. అయితే ఈ ఏడాది జనవరిలో యూకే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సమాచారం ప్రకారం.. ఉక్రెయిన్‌లో 50 వేల మంది ఫైటర్లు వాగ్నర్ గ్రూప్ తరపున రష్యాలో పోరాటం చేశారు.

Updated Date - 2023-06-24T18:12:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising