ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ukraine Vs Russia: క్షిపణుల వర్షంతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి!

ABN, First Publish Date - 2023-03-09T20:04:55+05:30

ఏడాది కాలంగా ఉక్రెయిన్‌(Ukraine)పై యుద్ధం చేస్తున్న రష్యా(Russia) తాజాగా దాడుల తీవ్రతను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కీవ్: ఏడాది కాలంగా ఉక్రెయిన్‌(Ukraine)పై యుద్ధం చేస్తున్న రష్యా(Russia) తాజాగా దాడుల తీవ్రతను మరింత పెంచింది. ఉక్రెయిన్‌పై గురువారం క్షిపణుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పలు పట్టణాలు, నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలపై రష్యా ఐదు నెలల క్రితం దాడి ప్రారంభించింది. ఫిబ్రవరి మధ్యలో ఉక్రెయిప్‌పై భారీ దాడులతో విరుచుకుపడిన రష్యా ఆ తర్వాత గురువారం ఉక్రెయిన్‌పై క్షిపణుల వర్షం కురిపించి ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ దాడిలో 10 ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలు, నివాస భవనాలు దెబ్బతిన్నట్టు అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ(Volodymyr Zelenskiy) తెలిపారు.

ఆక్రమణదారులు పౌరులను భయభ్రాంతులకు గురిచెయ్యగలరని, వారు అది మాత్రమే చేయగలరని జెలెన్‌స్కీ అన్నారు. కానీ దానివల్ల వారికి ఎలాంటి ఉపయోగమూ ఉందన్నారు. వారు చేసిన ప్రతి పనికి బాధ్యత వహించాల్సిందేనని, దేని నుంచి వారు తప్పించుకోలేరని జెలెన్ స్కీ హెచ్చరించారు.

పశ్చిమ లివ్‌లోని ఓ గ్రామంలో జరిగిన క్షిపణి దాడిలో కనీసం ఐదుగురు మరణించారు. డినిప్రో ప్రాంతంలో జరిగిన మరో మిసైల్ దాడిలో మరో పౌరుడు మరణించినట్టు అధికారులు తెలిపారు. ఇక, రాజధాని కీవ్‌లోని ప్రజలు పేలుళ్లతో వణికిపోతున్నారు. తనకు చాలా పెద్ద పేలుడు వినిపించిందని, వెంటనే బెడ్‌పై నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బయట చూస్తే ఓ కారు మంటల్లో కాలిపోతూ కనిపించిందని, ఇతర కార్లకు మంటలు అంటుకున్నాయని 58 ఏళ్ల మహిళ ఒకరు పేర్కొన్నారు. బాల్కనీలోని కిటికీ అద్దాలు పగిలిపోయాయన్నారు. తాము చాలా అంటే చాలా భయపడ్డామని, పిల్లాడు బెదిరిపోయాడని అన్నారు.

కాగా, రష్యా వివిధ నగరాలపై 81 క్షిపణులను ప్రయోగించిందని, వాటిలో 34 క్షిపణులను, షాహిద్ డ్రోన్లను కూల్చివేసినట్టు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కాగా, ఉక్రెయిన్‌పై జనవరి తర్వాత జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని చెబుతున్నారు. యూరప్‌లోని అతిపెద్ద జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌పైనా క్షిపణి దాడి జరిగింది. దీంతో విద్యుత్ సరఫరాను ఉక్రెయిన్ నిలిపివేసింది. ఫలితంగా జపోరిజ్జియా అణు విద్యుత్ కేంద్రానికి, ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థకు మధ్య ఉన్న చివరి సంబంధం తెగిపోయింది. ఉక్రెయిన్‌పై దురాక్రమణ ప్రారంభించిన తొలినాళ్లలోనే రష్యా ఈ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి అది వారి అధీనంలోనే ఉంది.

Updated Date - 2023-03-09T20:08:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising