Breaking news: తాలిబన్ల చేతిలో ఇద్దరు టాప్ ఇస్లామిక్ స్టేట్ కమాండర్ల హతం
ABN, First Publish Date - 2023-02-28T08:55:00+05:30
అఫ్ఘానిస్థాన్ దేశంలో తాలిబన్ దళాలు ఇద్దరు టాప్ ఇస్లామిక్ స్టేట్ కమాండర్లను కాల్చిచంపారు....
కాబూల్ (అఫ్ఘానిస్థాన్): అఫ్ఘానిస్థాన్ దేశంలో తాలిబన్ దళాలు టాప్ ఇస్లామిక్ స్టేట్ కమాండర్‌ను కాల్చిచంపారు.(Top Islamic State commander) అఫ్ఘానిస్థాన్ రాజధాని నగరమైన కాబూల్‌లో ఉగ్రవాద వ్యతిరేక దాడిలో తమ తాలిబన్ భద్రతా దళాలు(Taliban forces) ఇద్దరు కీలక ఇస్లామిక్ స్టేట్ కమాండర్లను హతమార్చాయని ఆఫ్ఘానిస్థాన్‌లోని(Afghanistan) తాలిబాన్ ప్రభుత్వం తెలిపింది.హతమైన ఉగ్రవాదుల్లో ఒకరైన ఖరీ ఫతే ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ మాజీ యుద్ధ మంత్రిగా ప్రకటించుకున్నాడని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్(Taliban spokesperson Zabihullah Mujahid) తెలిపారు.కాబూల్‌లో తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడారు.
ముజాహిద్ ఇస్లామిక్ స్టేట్ హింద్ ప్రావిన్స్ మొదటి ఎమిర్, ఎజాజ్ అహ్మద్ అహంగర్‌తో పాటు మరో ఇద్దరు అనుబంధ సంస్థల సభ్యుల హత్యను కూడా జబీహుల్లా ముజాహిద్ ధృవీకరించారు. రాజధాని కాబూల్‌లోని తమ రహస్య స్థావరంపై రాత్రిపూట ఉగ్రవాద నిరోధక దాడిలో ఇద్దరు కీలక ఇస్లామిక్ స్టేట్ కమాండర్లను తమ భద్రతా దళాలు సోమవారం హతమార్చాయని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ తెలిపింది.
ఇది కూడా చదవండి : IRCTC scam: లాలూయాదవ్, రబ్రీదేవీలకు ఢిల్లీ కోర్టు సమన్లు
ఆదివారం అర్థరాత్రి జరిగిన ఆపరేషన్‌లో మరణించిన వారిలో ఆఫ్ఘానిస్థాన్‌లోని ఇంటెలిజెన్స్ అండ్ ఆపరేషన్స్ చీఫ్ డేష్ కూడా ఉన్నారని తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ అర్థరాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.కాబూల్‌లోని దౌత్య కార్యాలయాలు, మసీదులపై ఇటీవల జరిగిన దాడులకు ఫతే సూత్రధారి అని ముజాహిద్ చెప్పారు.
Updated Date - 2023-02-28T09:42:26+05:30 IST