Flight windows missing: విమానం విండోలు మిస్సింగ్.. బెంబేలెత్తించిన భద్రతా లోపం
ABN, First Publish Date - 2023-11-10T21:07:27+05:30
లండన్ స్టాన్స్టెడ్ విమానాశ్రయం నుంచి ఫ్లోరిడాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి బయిలుదేరిన విమానం ఒకటి ప్రయాణికులను బెంబేలెత్తిచ్చింది. విమానం గాలిలో ఉండగా రెండు కిటికీలు దెబ్బతిన్న విషయాన్ని గమినించిన సిబ్బంది ఒక్కరు వెంటనే అప్రమత్తం చేయడంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు.
ఫ్లోరిడా: లండన్ స్టాన్స్టెడ్ విమానాశ్రయం (London Stansted Airport) నుంచి ఫ్లోరిడాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి బయిలుదేరిన విమానం ఒకటి ప్రయాణికులను బెంబేలెత్తిచ్చింది. విమానం గాలిలో ఉండగా రెండు కిటికీలు (Windows) దెబ్బతిన్న విషయాన్ని గమినించిన సిబ్బంది ఒక్కరు వెంటనే అప్రమత్తం చేయడంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. ప్రయాణికుల భద్రతపై తీవ్ర సందేహాలకు తావిచ్చిన ఈ ఘటన ఇటీవల చోటుచేసుకుంది.
సంఘటన వివరాల ప్రకారం, అక్టోబర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌బస్ A321 జెట్ 14,500 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో రెండు విండోలకు చెందిన ఇన్నర్, ఔటర్ పేన్స్, రబ్బర్ సీల్స్ లేవనే విషయం సిబ్బంది గుర్తించారు. ఈ ఘటన జరిగినప్పుడు 11 మంది సిబ్బంది, తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు. ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (AAIB) దీనిపై విచారణ జరపడంతో ఈ విషయం వెలుగుచూసింది. అమెరికాకు చెందిన లగ్జరీ హాలీడే కంపెనీ టీసీఎస్ వరల్డ్ ట్రావెల్ వినియోగిస్తుండగా, టైటాన్ ఎయిర్ వేస్ ఆపరేట్ చేస్తోంది.
ఎఏఐబీ సమాచారం ప్రకారం, విమానం టేకాఫ్ అయి, సీట్‌బైల్డ్ సైన్స్ స్విచ్ఛఆప్ అయిన తర్వాత విమానం వెనక వైపు సిబ్బంది వెళ్తుండగా విండోలు దెబ్బతిన్న విషయం గమనించారు. ఒక కిటికీ చుట్టూ ఉన్న రబ్బర్ సీల్ పట్టుకోల్పోయి వేలాడుతోంది. దీనికి ముందు రోజే ఒక ఫిల్మ్ చిత్రీకరణ కోసం ఈ విమానాన్ని వాడినట్టు తెలుస్తోంది. ఫిల్మింగ్ కోసం శక్తివంతమైన లైట్లు ఉపయోగించడం వల్ల విండోలు దెబ్బతిని ఉండవచ్చని ఏఏఐబీ అనుమానిస్తోంది. లైట్లకు, విమానం కిటికీలకు మధ్య దూరం కనీసం పది మీటర్లు ఉండాలని, అయితే చిత్రీకరణ సమయంలో ఆ దూరం ఆరు మీటర్ల నుంచి తొమ్మిది మీటర్ల దూరంలో ఉందని ఏఏఐబీ గమనించింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకని మరింత లోతుగా విచారణ జరుపుతోంది.
Updated Date - 2023-11-10T21:07:29+05:30 IST