ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Joe Bidens son Hunter: నేరాన్ని అంగీకరించిన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కొడుకు హంటర్..

ABN, First Publish Date - 2023-06-20T21:05:41+05:30

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) తనయుడు హంటర్ బైడెన్ (Hunter) అమెరికాలో పన్ను ఎగవేతకు పాల్పడ్డాడు. పలుమార్లు ఫెడరల్ ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించలేదంటూ నేరాన్ని స్వయంగా అంగీకరించాడు. తనపై ఆరోపణలకు సంబంధించి జస్టిస్ డిపార్ట్‌మెంట్‌తో జరిగిన డీల్‌లో ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. అంతేకాదు చట్టవిరుద్ధంగా ఒక తుపాకీని కూడా కలిగివున్నట్టు అంగీకరించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) తనయుడు హంటర్ బైడెన్ (Hunter) అమెరికాలో పన్ను ఎగవేతకు పాల్పడ్డాడు. పలుమార్లు ఫెడరల్ ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించలేదంటూ నేరాన్ని స్వయంగా అంగీకరించాడు. తనపై ఆరోపణలకు సంబంధించి జస్టిస్ డిపార్ట్‌మెంట్‌తో జరిగిన డీల్‌లో ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. అంతేకాదు చట్టవిరుద్ధంగా ఒక తుపాకీని కూడా కలిగివున్నట్టు అంగీకరించాడు. అమెరికాలో డ్రగ్స్ వినియోగిస్తున్న వ్యక్తులు గన్ కలిగివుండడం నేరం. కానీ హంటర్ మాత్రం డ్రగ్స్ వాడుతున్నప్పటికీ చట్టవిరుద్ధంగా తుపాకీ కలిగివున్నాడు. ఈ మేరకు హంటర్ బిడెన్, యూఎస్ ప్రాసిక్యూటర్ల (లాయర్లు) మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ అగ్రిమెంట్‌ను ఫెడరల్ జడ్జి ఆమోదించాల్సి ఉంది.

కాగా హంటర్ బైడెన్‌పై వచ్చిన ఆరోపణలపై జో బైడెన్ సొంత రాష్ట్రమైన డెలావేర్‌లో యూఎస్ అటార్నీ డేవిడ్ వీస్ దర్యాప్తు జరిపారు. డేవిడ్ వీస్‌ను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించడం గమనార్హం. ఇదిలావుండగా 53 ఏళ్ల హంటర్ బైడెన్‌పై డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ నేతలు కొన్నేళ్లుగా విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. ఉక్రెయిన్, చైనాలకు సంబంధించిన వ్యవహారాల్లో చట్టవిరుద్ధంగా నడుచుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. హంటర్ బిడెన్ లాబీయిస్ట్‌గా, లాయర్‌గా, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పనిచేశారు. తనపై నిందలు వేస్తున్నారంటూ కొట్టిపారేస్తూ వచ్చారు. డేవిడ్ వీస్ కార్యాలయం తన పన్ను వ్యవహారాలపై దర్యాప్తు జరుపుతోందని డిసెంబర్ 2020లో ఆయన చెప్పారు.

Updated Date - 2023-06-20T21:05:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising