ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

America - China: అమెరికా విమానానికి చేరువగా చైనా ఫైటర్ జెట్.. వీడియో రిలీజ్ చేసిన మిలిటరీ

ABN, First Publish Date - 2023-10-27T13:20:03+05:30

దక్షిణ చైనా సముద్రం మీదుగా అమెరికా విమానానికి( B-52) 10 అడుగుల దూరంలో చైనా ఫైటర్ జెట్(Fighter Jet) ఎగిరిందని అమెరికా(America) ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను యూఎస్ మిలిటరీ(US Military) విడుదల చేసింది.

న్యూయార్క్:దక్షిణ చైనా సముద్రం మీదుగా అమెరికా విమానానికి( B-52) 10 అడుగుల దూరంలో చైనా ఫైటర్ జెట్(Fighter Jet) ఎగిరిందని అమెరికా(America) ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను యూఎస్ మిలిటరీ(US Military) విడుదల చేసింది. ఫ్లైటర్ జెట్(J - 11) అకస్మాత్తుగా రావడంతో గాల్లోనే రెండు ఫ్లైట్స్ ఢీకొని పెను ప్రమాదం జరిగేదని తృటిలో ప్రమాదం నుంచి బయటపడినట్లు అమెరికా అధికారులు తెలిపారు. గగనతలంలో దక్షిణ చైనా సముద్రంపై అమెరికాకు చెందిన విమానం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చైనా పైలట్ మితిమీరిన వేగంతో ఫ్లైట్ నడిపాడని అమెరికా ఆరోపించింది. వీడియోలో అమెరికన్ జెట్ రెక్కకు దిగువ భాగన చైనీస్ ఫ్లైట్ వెళ్తుండటం కనిపిస్తోంది.


అంతర్జాతీయ వాయు భద్రతా నియమాలు, నిబంధనలకు విరుద్ధంగా చైనా ప్రవర్తించిందని యూఎస్ మిలిటరీ ఆరోపించింది. తూర్పు, దక్షిణ చైనాలోని గగనతలంలో పని చేస్తున్న అమెరికా విమానాలకు వ్యతిరేకంగా చైనా సైన్యం ఏడాదిన్నర కాలంగా ప్రమాదకర విన్యాసాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన 15 ఫొటోలను అమెరికా విడుదల చేసిన కొన్నాళ్ల తరువాత తాజా ఘటన చోటు చేసుకుంది. కాగా, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మూడు రోజుల పర్యటన నిమిత్తం గురువారం వాషింగ్టన్ చేరుకున్నారు. ఆయన అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌ను కలుసుకున్నారు. ఇరు దేశాలు పలు అంశాలపై చర్చించుకున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-10-27T13:31:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising