ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Putin: బైడెన్ పర్యటన వేళ.. ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ అత్యంత కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-02-21T16:12:24+05:30

ఉక్రెయిన్‌పై దాడికి వెళ్లడానికి పశ్చిమ దేశాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. పశ్చిమదేశాలు డర్టీ గేమ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: ఉక్రెయిన్‌పై దాడికి వెళ్లడానికి పశ్చిమ దేశాలే కారణమని రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir putin) ఆరోపించారు. పశ్చిమదేశాలు డర్టీ గేమ్ (Dirty Game) ఆడుతున్నాయని అన్నారు. శాంతియుత విధానాల ద్వారా 'డాన్‌‍బాస్' సమస్యలను పరిష్కరించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలను మాస్కో చేస్తోందన్నారు. ఉక్రెయిన్ పౌరులతో రష్యా యుద్ధం చేయడం లేదని, ఉక్రెయిన్ పాలన (Regime)పైనే తమ యుద్ధమని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది కావడం, అమెరికా అధ్యక్షుడు జో బైడన్ (Joe Biden) అకస్మాత్తుగా ఉక్రెయిన్‌లో పర్యటించిన నేపథ్యంలో ఫెడరల్ అసెంబ్లీ (Federal Assembly)ని ఉద్దేశించి వ్లాదిమిర్ పుతిన్ మంగళవారంనాడు ప్రసంగించారు.

రష్యా వస్తుందని, తమను ఆదుకుంటుందని డాన్‌బాస్ ఎంతో నమ్మకంతో ఎదురుచూస్తోందని పుతిన్ అన్నారు. డాన్‌బాస్‌పై కివ్ కఠిన చర్యలను తిప్పికొట్టేందుకు సన్నద్ధంగా ఉన్నామన్నారు. నాటో దళాలను పెంచుతూ, పశ్చిమ దేశాలే దురుసుగా ప్రవర్తిస్తున్నాయని అన్నారు. స్థానిక సమస్యలను ప్రపంచ దేశ సమస్యగా మారుస్తున్నాయని ఉక్రెయిన్, పశ్చిమ దేశాలపై ఆయన నిప్పులు కురిపించారు. వాళ్ల దూకుడుకు అడ్డుకునేందుకే సైన్యాన్ని వాడుతున్నామని పుతిన్ తెలిపారు.

డాన్‌బాస్‌లో ఏమి జరుగుతోందనే విషయంపై పూర్తి అవాస్తవాలు, అబద్ధాలు చెబుతూ పశ్చిమదేశాలు తమ ప్రజలను వంచిస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. ''మరోసారి మీకు చెప్పదలచుకున్నాను. యుద్ధం వాళ్లు ప్రారంభించారు. దానిని అడ్డుకునేందుకు మనం సైన్యాన్ని రంగంలోకి దింపాం'' అని అన్నారు. ఉక్రెయిన్ ప్రజలు వెస్ట్రన్ మాస్టర్ల చేతిలో ''బందీలు''గా మారారని, ఉక్రెయిన్ పాలకులు దేశ ప్రయోజనాలను కాపాడలేరని, విదేశీ శక్తుల ప్రయోజనాలను కాపాడేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశం కోసం పోరాడుతున్న సైనికులు, వారి కుటుంబాలకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు తాను శిరసు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.

Updated Date - 2023-02-21T16:27:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising