Mamata Banerjee: మమతకు శ్రీలంక అధ్యక్షుడి అనూహ్య ప్రశ్న.. దీదీ ఏం చెప్పారంటే?
ABN, First Publish Date - 2023-09-13T17:13:13+05:30
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే నుంచి అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది. ''విపక్ష కూటమి ఇండియాకు మీరు సారథ్యం వహించనున్నారా? అని విక్రమ్ సింఘే ప్రశ్నించారు. "అది ప్రజలపై ఆధారపడి ఉంటుంది. విపక్ష కూటమి అధికారంలోకి కూడా రావచ్చు'' అని మమతాబెనర్జీ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
దుబాయ్: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే (Ranil Wickremesinghe) నుంచి అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది. ''విపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A.)కు మీరు సారథ్యం వహించనున్నారా? అని విక్రమ్ సింఘే ప్రశ్నించారు. "అది ప్రజలపై ఆధారపడి ఉంటుంది. విపక్ష కూటమి అధికారంలోకి కూడా రావచ్చు'' అని మమతాబెనర్జీ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. 12 రోజుల దుబాయ్, స్పెయిన్ పర్యటనలో భాగంగా మమతా బెనర్జీ దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఇరువురు నేతలు కలుసుకున్నారు.
''దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం లాంజ్‌లో నన్ను శ్రీలంక అధ్యక్షులు రణిల్ విక్రమ్ సింఘే చూశారు. కలిసి మాట్లాడుకుందా రమ్మని ఆహ్వానించారు. కోల్‌కతాలో జరిగే 2023 బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌కు రావాల్సిందింగా ఆయనను ఆహ్వానించాను'' అని మమతా బెనర్జీ ఒక ట్వీట్ చేశారు. శ్రీలంకకు రావాల్సిందిగా తనను ఆహ్వానించిన విక్రమ్ సింఘేకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం సాయంత్రం దుబాయ్ చేరుకున్న మమతా బెనర్జీ బుధవారం ఉదయం స్పెయిన్‌కు బయలుదేరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానం పలికేందుకు స్పెయిన్‌లో జరిగే బిజినెస్ సమ్మిట్స్‌కు ఆమె హాజరుకానున్నారు. కాగా, నవంబర్ 21-22 తేదీల్లో కోల్‌కతాలో బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ జరగనుంది.
Updated Date - 2023-09-13T18:07:07+05:30 IST