ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

G20 Summit: జీ20 సదస్సుకు షీ జిన్‌పింగ్ డుమ్మా.. చైనా ప్రీమియర్ వస్తారని బీజింగ్ స్పష్టం.. జో బైడెన్ ఏమన్నారంటే?

ABN, First Publish Date - 2023-09-04T16:29:20+05:30

భారతదేశంలో ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 సమ్మిట్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకాకపోవచ్చని ఇటీవల ఓ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రచారం...

భారతదేశంలో ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 సమ్మిట్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకాకపోవచ్చని ఇటీవల ఓ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రచారం నిజమేనని తాజాగా బీజింగ్ స్పష్టం చేసింది. కొన్ని అనుకోని కారణాల వల్ల జీ20 సమావేశాలకు జిన్‌పింగ్ హాజరుకావడం లేదని చైనా విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. జిన్‌పింగ్ స్థానంలో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ ఈ జీ20 సదస్సులో పాల్గొనడానికి భారత్ వస్తారని వెల్లడించింది.

‘‘భారత్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న జీ20 సమావేశాలకు చైనా ప్రీమియర్ లీ కియాంగ్ హాజరవుతారు. ఈ శిఖరాగ్ర సమావేశాల్లో రెండు దేశాల దౌత్యపరమైన సంబంధాల విషయమై ఏకాభిప్రాయాన్ని సాధించి, అభివృద్ధికి దోహదపడతాం’’ అని చైనా విదేశాంగ శాఖ స్పోక్స్‌పర్సన్ మావో నింగ్ పేర్కొన్నారు. అంతేకాదు.. జీ20 లాంటి సంబంధిత కార్యక్రమాలకు చైనా ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. భారత్‌లో జరిగే జీ20 సమ్మిట్‌కి లీ చియాంగ్ హాజరైనప్పుడు.. చైనా ఆలోచనలను పంచుకుంటారన్నారు. సమాఖ్య దేశాల ఐక్యతను బలోపేతం చేసి, ప్రపంచ ఆర్ధికాభివృద్ధికి మిగతా దేశాలతో కలిసి పనిచేసే విషయమై చైనా అభిప్రాయాల్ని లీ చియాంగ్ వెల్లడిస్తారని తెలిపారు.


స్థిరమైన ప్రపంచ ఆర్ధిక పునరుద్ధరణ, సుస్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించేందుకు మిగతా జీ20 భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తామని.. ఈ సమావేశాలు విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నామని మావో నింగ్ చెప్పుకొచ్చారు. అయితే.. ఈ జీ20 సదస్సుకు జిన్‌పింగ్ హాజరుకాకపోవడానికి గల సరైన కారణాల్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. మరోవైపు.. జిన్‌పింగ్ ఈ 20 సదస్సుకు హాజరుకాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిరాశ వ్యక్తం చేశారు. చైనా అధ్యక్షుడు ఈ సదస్సుకు రాకపోవడం నిరాశ గురి చేసిందని, అయితే త్వరలోనే ఆయనను తాను చూడబోతున్నానని చెప్పారు. కానీ.. ఎక్కడ కలవబోతున్నారనే విషయాన్ని మాత్రం జో బైడెన్ వెల్లడించలేదు.

కాగా.. కొంతకాలం నుంచి సరిహద్దు విషయంపై భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరిగిపోయాయి. ఇది చాలదన్నట్టు.. ఇటీవల చైనా 2023 ఎడిషన్ పేరుతో ఆ దేశం ఒక వివాదాస్పద మ్యాప్‌ని విడుదల చేసింది. ఇందులో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయి చిన్‌లను తమ భూభాగాలుగా ఆ మ్యాప్‌లో చూపించడంతో.. భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇతర దేశాలు కూడా భారత్‌కు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే జిన్‌పింగ్ ఈ సదస్సుకు రావడం లేదని తెలుస్తోంది. జిన్‌పింగ్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ సమావేశాలకి హాజరు కావట్లేదు. ఈ విషయాన్ని స్వయంగా పుతిన్ ఫోన్ చేసి, మోదీకి తెలియజేశారు. పుతిన్ స్థానంలో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ వస్తారు.

Updated Date - 2023-09-04T16:29:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising