ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Yevgeny Prigozhin: ట్విస్టులకే ట్విస్ట్.. నేను బ్రతికే ఉన్నానన్న ప్రిగోజిన్.. వైరల్ అవుతున్న వీడియో

ABN, First Publish Date - 2023-08-31T19:05:57+05:30

వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్‌జెనీ ప్రిగోజిన్ ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందినట్లు రష్యా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో ప్రిగోజిన్‌కి సంబంధించిన ఒక వీడియో...

వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్‌జెనీ ప్రిగోజిన్ ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందినట్లు రష్యా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో ప్రిగోజిన్‌కి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వాగ్నర్ గ్రూప్‌తో అనుసంధానమైన ఓ టెలిగ్రామ్ ఛానెల్ ఈ వీడియోని విడుదల చేసింది. ఇందులో తన యోక్షక్షేమాల గురించి చెప్పిన ప్రిగోజిన్.. తన సెక్యూరిటీ దళానికి బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రిగోజిన్ చనిపోవడానికి ముందు ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఈ వీడియో తీసినట్టు తెలుస్తోంది. ఈ వీడియోలో ప్రిగోజిన్ ఆర్మీ దుస్తుల్లో ఉండగా.. కదులుతున్న కారులో ఆగస్టు 21వ తేదీన ఈ వీడియోని రికార్డ్ చేశారు.


ఈ వీడియోలో ప్రిగోజిన్ మాట్లాడుతూ.. ‘‘నేను బ్రతికే ఉన్నానా? లేక చనిపోయానా? నేనేం చేస్తున్నాను? అని చర్చించుకునే వాళ్ల కోసమే ఈ వీడియో తీస్తున్నాను. ఇది ఆగస్టులో సెకండాఫ్‌. నేను ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నాను. నా చావు గురించి, వ్యక్తిగత జీవితం గురించి, నేనెంత సంపాదిస్తున్నానన్న విషయాలపై జనాలు చర్చించుకుంటున్నారు. వాళ్లందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా. అన్ని బాగున్నాయ్’’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రికి సలహాదారు అయిన అంటోన్ గెరాష్చెంకో ఈ వీడియోని ట్విటర్‌లో (X ప్లాట్‌ఫామ్) షేర్ చేయడంతో.. ఇది చర్చలకు దారి తీసింది. ‘‘ప్రిగోజిన్ ఇంకా బ్రతికే ఉన్నాడా? లేదా?’’ అని నెటిజన్లు అనుమానాలు లేవనెత్తుతున్నారు. ప్రిగోజిన్‌కి సంబంధించి మరిన్ని వీడియో షేర్ చేయాల్సిందిగా నెటిజన్లు కోరుతున్నారు.

ఇదిలావుండగా.. ఒకప్పుడు సాధారణ జీవితం గడిపిన ప్రిగోజిన్ అంచలంచెలుగా ఎదుగుతూ కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్‌కి అధిపతిగా అవతరించాడు. ఇతని సైన్యం రష్యా సైన్యంతో కలిపి పోరాడింది. కానీ.. జూన్ నెలలో పుతిన్‌పై ప్రిగోజిన్ తిరుగుబాటు ప్రకటించాడు. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ఓ ఒప్పందంతో ప్రిగోజిన్ వెనకడుగు వేశాడు. కానీ.. ఇంతలోనే విమాన ప్రమాదంలో అతను మరణించాడు. అతనితో పాటు మరో 9 మంది (వారిలో ఒకరు వాగ్నర్ గ్రూప్ కీలక సభ్యుడు ఉన్నాడు) మృతి చెందినట్లు రష్యా అధికారికంగా ధృవీకరించింది. తనపై తిరుగుబాటు ప్రకటించినందుకే.. పుతిన్ కుట్రపన్ని ప్రిగోజిన్‌ని చంపాడని పుకార్లు వచ్చాయి. అయితే.. వాటిని క్రెమ్లిన్ కొట్టిపారేసింది. అందులో వాస్తవం లేదని తేల్చి చెప్పింది.

Updated Date - 2023-08-31T19:05:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising