Ayodya: 1000 ట్రైన్లు.. 100 రోజులు.. అయోధ్య భక్తులకు రైల్వే శాఖ తీపికబురు
ABN, Publish Date - Dec 16 , 2023 | 10:26 AM
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య(Ayodya)కు వచ్చే భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
ఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య(Ayodya)కు వచ్చే భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని ప్రధాన నగరాల నుంచి 1000 ప్రత్యేక రైళ్లను అయోధ్యకు నడపనున్నట్లు భారత రైల్వే శాఖ(Indian Railways) అధికారులు ఇవాళ వెల్లడించారు. జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"
జనవరి 19నుంచి ఈ రైళ్లు నడుపుతారు. జనవరి 23న శ్రీరాముడి(Lord Rama) విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఉండనుంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, పుణె, కోల్ కతా, నాగ్ పుర్, లఖ్ నవూ, జమ్మూతో సహా దేశంలోని ప్రధాన నగరాల నుంచి ఇవి నడవనున్నాయి. అయోధ్యలోని స్టేషన్ ని కూడా పునరుద్ధరించారు.
రోజుకి 50 వేల మంది ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేశారు. జనవరి 15నాటికి ఇది పూర్తిగా అందుబాటులోకి రానుంది. అయోధ్య ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ సహా అగ్రనేతలు తరలిరానున్నారు.
Updated Date - Dec 16 , 2023 | 10:27 AM