ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cheetahs: ఐఏఎఫ్ కార్గో విమానంలో గ్వాలియర్ వచ్చిన ఆఫ్రికన్ చీతాలు

ABN, First Publish Date - 2023-02-18T08:23:10+05:30

దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కార్గో విమానంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కుకు...

South Africa Cheetahs to India
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కునో నేషనల్ పార్క్ (మధ్యప్రదేశ్): భారతదేశంలో చీతాల సంఖ్యను విస్తరించడానికి దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలు శనివారం ఉదయం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కార్గో విమానంలో గ్వాలియర్ విమానాశ్రయానికి వచ్చాయి. ఈ చీతాలకు స్వాగతం పలికిన అధికారులు వీటిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కుకు(Kuno National Park)తరలించనున్నారు.(South Africa Cheetahs to India) దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలు విమానంలో మధ్యప్రదేశ్‌కు బయలుదేరాయి.చిరుతలను తీసుకువస్తున్న విమానం శనివారం ఉదయం 10 గంటలకు గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ల్యాండ్ అయింది.

ఆఫ్రికన్ చీతాల కోసం కునో నేషనల్ పార్క్‌లో 10 క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లు సృష్టించినట్లు అధికారులు తెలిపారు.గతంలో నమీబియా దేశం నుంచి 8 చీతాలను కునో నేషనల్ పార్కుకు తీసుకువచ్చారు. చిరుతలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌లు కునో నేషనల్ పార్క్‌లోని వారి క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లలోకి విడుదల చేస్తారు.

ఇది కూడా చదవండి : Amazon: మే నుంచి వారానికి 3రోజులు వర్క్ ఫ్రం ఆఫీస్...అమెజాన్ ప్రకటన

భారతదేశంలో చివరి చిరుత 1947లో ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో మరణించింది. చీతాల జాతి 1952లో దేశంలో అంతరించిపోయింది.దీంతో ప్రపంచంలోని మొట్టమొదటి ఖండాంతర ట్రాన్స్‌లోకేషన్ ప్రాజెక్టులో భాగంగా కేంద్రం భారతదేశంలో చీతాలను తిరిగి ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.ప్రపంచంలోని 7,000 చిరుతల్లో ఎక్కువ భాగం దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్వానా దేశాల్లోని అడవుల్లో ఉన్నాయి.

Updated Date - 2023-02-18T11:05:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising