ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kashmir: జమ్మూ కశ్మీర్‌లో పాక్ కవ్వింపులు.. కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లకు తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2023-10-27T08:48:53+05:30

భారత సరిహద్దులో దాయాది పాకిస్థాన్(Pakisthan) మళ్లీ కవ్వింపు చర్యలకు దిగుతోంది. జమ్మూ కశ్మీర్(Jammu Kashmir) సరిహద్దులో భారత జవాన్లపై(Jawans) పాకిస్థాన్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు.

ఢిల్లీ: భారత సరిహద్దులో దాయాది పాకిస్థాన్(Pakistan) మళ్లీ కవ్వింపు చర్యలకు దిగుతోంది. జమ్మూ కశ్మీర్(Jammu Kashmir) సరిహద్దులో భారత జవాన్లపై(Jawans) పాకిస్థాన్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. బీఎస్ఎఫ్(BSF) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కశ్మీర్ లోని ఆర్నియా, సుచేతఘర్ సెక్టార్ లలో అంతర్జాతీయ సరిహద్దు(IB) వెంట 5 భారత పోస్టులపై గురువారం రాత్రి పాకిస్థాన్ రేంజర్లు అకారణంగా కాల్పులు జరిపారు.


భారత జవాన్లు ప్రతిఘటించినప్పటికీ.. దాయాదుల చేతుల్లో ఇద్దరు సరిహద్దు భద్రతా దళ సిబ్బంది, ఒక పౌరుడు గాయపడ్డాడు. క్షతగాత్రులను హుటాహుటిన జమ్మూలోని జీఎంసీ ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. అర్నియా సెక్టార్‌లో రాత్రి 8 గంటల ప్రాంతంలో పాక్ సైనికులు కాల్పులు ప్రారంభించారని అధికారులు వెల్లడించారు. నాలుగు నుంచి ఐదు పోస్టులు ఇరువైపులా కాల్పుల్లో పాల్గొన్నాయని బీఎస్ఎఫ్ అధికారి వెల్లడించారు. ప్రతిదాడుల్లో పాక్ పోస్టులకు జరిగిన నష్టంపై అంచనా వివరాలు ఇవాళ తెలుస్తుందని చెప్పారు. పాక్ రేంజర్లు పబ్లిక్ ఏరియాల్లో మోర్టార్ షెల్స్ ని ఉపయోగిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆర్నియా, సుచ్త్ గఢ్, సియా, జబోవాల్, ట్రెవా ప్రాంతాల ప్రజలు పాక్ దాడుల్లో ప్రభావితం అయ్యాయి. భయాందోళనకు గురైన పబ్లిక్ అర్నియా, జబోవాల్ లోని ఇళ్లు వదిలి వెళ్లిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Updated Date - 2023-10-27T08:49:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising