Kerala: గూగుల్ మ్యాప్స్ నమ్మి నదిలోకి దూసుకెళ్లిన కారు.. నీటిలో మునిగి ఇద్దరు డాక్టర్లు మృతి
ABN, First Publish Date - 2023-10-02T14:45:49+05:30
గూగుల్ మ్యాప్స్ ని నమ్మి ఓ కారు యజమాని వాహనాన్ని నదిలోకి తీసుకుపోవడంతో పెను ప్రమాదం సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళ(Kerala)లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదే టైంలో అయిదుగురితో వెళ్తున్న ఓ కారు కొచ్చి(Kochi) గుండా వెళ్తోంది.
తిరువనంతపురం: గూగుల్ మ్యాప్స్ ని నమ్మి ఓ కారు యజమాని వాహనాన్ని నదిలోకి తీసుకుపోవడంతో పెను ప్రమాదం సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళ(Kerala)లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదే టైంలో అయిదుగురితో వెళ్తున్న ఓ కారు కొచ్చి(Kochi) గుండా వెళ్తోంది. కారు డ్రైవర్ గూగుల్ మ్యాప్(Google Maps) ఆధారంగా చేరుకునే గమ్యాన్ని చూస్తున్నాడు. కారు పెరియార్(Periyar) నది వద్దకు రాగానే వారికి రోడ్డు కనిపించలేదు. దీంతో గూగుల్ మ్యాప్ తప్పుడు రహదారిని చూపించింది. డ్రైవర్ దాన్ని ఫాలో కావడంతో వాహనం పెరియార్ నదిలో పడిపోయింది.
దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు డాక్టర్లు(Doctors) మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అద్వైత్(29), అజ్మల్(29)లను మృతులుగా గుర్తించారు. వీరిద్దరూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులుగా పని చేస్తున్నారు. గూగుల్ మ్యాప్ పక్కదోవ పట్టించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. లెఫ్ట్ టర్న్ తీసుకోవాలని గూగుల్ మ్యాప్ సూచించడంతో.. కారు అటుగా వెళ్లి నీట మునిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-10-02T14:45:49+05:30 IST