హిమాచల్‌లో 24 గంటల వ్యవధిలో 21 మంది మృతి
ABN, First Publish Date - 2023-08-14T13:44:59+05:30
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. హిమాచల్‌లో 24 గంటల వ్యవధిలో 21 మంది మృతి చెందారు. భారీ వర్షాలకు తోడు క్లౌడ్ బరస్ట్ ఘటనల కారణంగా భారీ విధ్వంసాలు చోటు చేసుకున్నాయి.
ఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. హిమాచల్‌లో 24 గంటల వ్యవధిలో 21 మంది మృతి చెందారు. భారీ వర్షాలకు తోడు క్లౌడ్ బరస్ట్ ఘటనల కారణంగా భారీ విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. హిమాచల్ రాజధాని సిమ్లా సహా పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. సిమ్లా సమ్మర్ హిల్ ప్రాంతంలో శివాలయంపై కొండచరియలు జారిపడ్డాయి. శివాలయం ఘటనలో 9 మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికితీసింది. సిమ్లాలో రెండు ఘటనల్లో 15-20 మంది ఇంకా కొండచరియల కింద చిక్కుకున్నట్టు అంచనా. సోలన్ జిల్లా కందఘాట్ సమీపంలోని మామ్లిగ్ వద్ద నివాసాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. శిధిలాల కింద మరో ఇద్దరు చిక్కుకున్నారు.
Updated Date - 2023-08-14T13:44:59+05:30 IST