ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Covid-19: 24 గంటల్లో కొత్తగా 322 కేసులు.. కేరళలో ఒకరి మృతి

ABN, Publish Date - Dec 24 , 2023 | 01:49 PM

దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 322 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందినట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి. కొత్త కేసులతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,742కు చేరింది.

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 (Covid-19) కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 322 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందినట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి. కొత్త కేసులతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,742కు చేరింది. కేరళలో అత్యధికంగా 128 కేసులు, కర్ణాటకలో 96, మహారాష్ట్రలో 35 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో డిల్లీలో 16 కొత్త కేసులు నమోదయ్యాయి.


కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, ఇండియాలో కోవిడ్‌తో ఇంతవరకూ మరణించిన వారి సంఖ్య 4,635కి చేరింది. 3,657 మంది అంటే 97.9 శాతం మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 450గా (1.2 శాతం) ఉంది. ఒక్క శనివారంనాడే కేవలం 24 గంటల్లో కోవిడ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అత్యధిక కేసులు కేరళలో నమోదయ్యాయి. మొత్తం 423 కేసులు నమోదు కాగా, కేరళలో 266, పొరుగున ఉన్న కర్ణాటకలో 70 కేసులు నమోదయ్యాయి. కేరళలో ఇద్దరు మృతి చెందగా, దేశంలో 3,420 కోవిడ్ యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి. కోవిడ్ కొత్త వేరింట్ వెలుగు చూడటం ఒకవైపు ఆందోళన కలిగిస్తుండగా, ప్రస్తుతం ఎలాంటి ఆందోళన అవసరం లేదని డబ్ల్యూహెచ్ఏ మాజీ చీఫ్ సైంటిసెట్ డాక్టర్ సౌమ్య సోమనాథన్ తెలిపారు. ఇది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని, ఆందోళన కలిగించే వేరియంట్ కాదని చెప్పారు. అయితే, ప్రజలు తగినన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Updated Date - Dec 24 , 2023 | 01:49 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising