NDA meeting: 38 పార్టీలు హాజరవుతున్నాయి: నడ్డా
ABN, First Publish Date - 2023-07-17T19:16:22+05:30
ఎన్డీయే దేశానికి అందిస్తున్న సేవలు, దేశ పటిష్టత కోసం చేస్తున్న కృషి ప్రశంసనీయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఈనెల 18వ తేదీన ఏర్పాటు ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న ఎన్‌డీఏ సమావేశంలో 38 పార్టీలు పాల్గొంటున్నట్టు చెప్పాయని తెలిపారు. యూపీఏ కూటమికి ఒక నేత కానీ, నిర్ణయాలు తీసుకునే అధికారం కానీ లేదని అన్నారు.
న్యూఢిల్లీ: జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) దేశానికి అందిస్తున్న సేవలు, దేశ పటిష్టత కోసం చేస్తున్న కృషి ప్రశంసనీయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) అన్నారు. ఈనెల 18వ తేదీన ఏర్పాటు ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న ఎన్‌డీఏ సమావేశంలో 38 పార్టీలు పాల్గొంటున్నట్టు చెప్పాయని తెలిపారు. యూపీఏపై విమర్శలు గుప్పిస్తూ, ఆ కూటమికి ఒక నేత కానీ, నిర్ణయాలు తీసుకునే అధికారం కానీ లేదని అన్నారు.
'ఎన్డీయే ఒక ఆదర్శనీయమైన కూటమి. దేశ పటిష్టత, సేవల కోసం పనిచేస్తోంది. యూపీఏకి ఒక నేత కానీ, నిర్ణయాలు తీసుకునే అధికారం కానీ లేదు. స్వార్థ ప్రయోజనాల కోసం, గ్రూప్ ఫోటోలు దిగడం కోసం ఏర్పాటైన కూటమి'' అని నడ్డా విమర్శించారు. గత తొమ్మిదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పటిష్ట నాయకత్వంలో దేశం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని అన్నారు. అవినీతికి ఎంతమాత్రం సహించలేదని ఆచరణలో చూపించామని, కోవిడ్ నిర్వహణలో ప్రధాని అందరికీ ఒక ఉదాహరణగా నిలిచారని ప్రశంసించారు. మోదీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం గత 9 ఏళ్లలో సుపరిపాలన అందించిందని, అందుకోసం చేస్తున్న కృషి కొనసాగుతుందని చెప్పారు. ఇంతవరకూ లబ్ధిదారులకు రూ.29 లక్షల కోట్లు నేరుగా వారి అకౌంట్లలోకి జమ అయ్యాయని చెప్పారు.
Updated Date - 2023-07-17T19:30:22+05:30 IST