ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Maharashtra Dalits: మహారాష్ట్రలో దారుణం.. దళితుల్ని కట్టేసి, కర్రలతో కొట్టి.. ఆ ఒక్క కారణం వల్లే..!

ABN, First Publish Date - 2023-08-28T19:49:38+05:30

ఓవైపు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ దూసుకుపోతుంటే.. దేశంలోని దళితుల రాతలు మాత్రం మారడం లేదు. వీరిపై ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. అగ్రవర్ణాల ...

ఓవైపు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ దూసుకుపోతుంటే.. దేశంలోని దళితుల రాతలు మాత్రం మారడం లేదు. వీరిపై ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. అగ్రవర్ణాల వాళ్లు వీరిని చిత్రహింసలకు గురి చేస్తూనే ఉన్నారు. కారణాలు లేకుండానే.. వారిపై పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు. తోటి మనిషే కదా అని మానవత్వం కూడా లేకుండా.. రాక్షసుల్లా దళితులపై దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలోనూ అలాంటి ఘోరమే వెలుగు చూసింది. ఏ పాపం చేయకపోయినా.. నలుగురు దళిత యువకుల్ని కొందరు చితకబాదారు. తలక్రిందులుగా కట్టేసి.. దారుణంగా హింసించారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా శ్రీరామ్‌పుర్‌ తాలుక పరిధి హరేగాన్‌లో సడెన్‌గా మేకలు, పావురాలు మాయమవ్వడం ప్రారంభమైంది. వీటిని ఎవరైనా దొంగలిస్తున్నారా? లేక స్వయంగా అవే తప్పిపోతున్నాయా? అనే విషయం అంతుచిక్కలేదు. అయితే.. ఒక వ్యక్తికి మాత్రం తమ ఇంటి పక్కనే నివాసం ఉంటున్న దళిత యువకులపై అనుమానం వచ్చింది. ఇదే విషయాన్ని కొంతమందితో అతడు పంచుకున్నాడు. దీంతో.. వాళ్లందరూ కలిసి ఆ దళిత యువకులకు తగిన బుద్ధి చెప్పాలని వాళ్లు అనుకున్నారు. ఈనెల 26వ తేదీన ఆరుగురు వ్యక్తులు కలిసి.. ఆ దళిత యువకుల ఇంటికి వెళ్లారు. తమతో పాటు రావాలని, కొంచెం పనుందని వాళ్లు చెప్పారు. అయితే.. ఆ యువకులకు అనుమానం రావడంతో వారితో వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో.. ఆ యువకుల్ని వాళ్లు బలవంతంగా తీసుకొని వెళ్లారు.


ఒక ప్రాంతానికి తీసుకెళ్లి.. అక్కడ ఒక చెట్టుకి తలక్రిందులుగా వేలాడదీసి, కర్రలతో కొట్టడం మొదలుపెట్టారు. తమ మేకల్ని, పావురాల్ని దొంగలించింది మీరే కదా అంటూ వారిని విచక్షణారహితంగా కొట్టారు. తాము కొట్టేయలేదని, తమని విడిచిపెట్టమని వాళ్లు ప్రాధేయపడినా.. ఆ దుర్మార్గులు కనికరించలేదు. వారిలో ఒకరు ఈ మొత్తం తతంగాన్ని ఫోన్‌లో రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో వదిలాడు. దాంతో ఇది వైరల్ అయ్యి.. పోలీసుల దృష్టికి చేరింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఈ దారుణానికి ఒడిగట్టిన యువరాజ్ గలాండే, మనోజ్ బోడకే, పప్పు పార్కే, దీపక్ గైక్వాడ్, దుర్గేష్ వైద్య, రాజు బొరాగేలను అరెస్ట్ చేశారు. వారిపై హత్యాయత్నం, కిడ్నాప్, ఎస్సీ-ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు.. బాధితుల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

కాగా.. దళితులపై ఇలాంటి ఘటనలు ఈమధ్యకాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఆమధ్య మధ్యప్రదేశ్‌లో దళితుడిపై ఓ వ్యక్తి మూత్రం పోసిన ఘటన ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే! స్వయంగా ముఖ్యమంత్రి (శివరాజ్ సింగ్ చౌహాన్) రంగంలోకి దిగి.. ఆ దళితుడికి కాళ్లు కడిగి మరీ క్షమాపణలు చెప్పారు. అటు.. ఉచితంగా చికెన్ ఇవ్వలేదన్న పాపానికి మరో దళితుడ్ని కొట్టారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి కూడా తళిత యువకుడ్ని కొట్టి, అతనితో తన చెప్పులు నాకించాడు.

Updated Date - 2023-08-28T19:49:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising