Punjab: బైసాఖీ వేడుకల్లో విషాదం...ట్రక్కు ఢీకొని ఏడుగురు యాత్రికుల మృతి
ABN, First Publish Date - 2023-04-13T11:49:33+05:30
పంజాబ్ రాష్ట్రంలోని హోషియార్‌పూర్ జిల్లాలో గురువారం జరుగుతున్న బైసాఖీ వేడుకల్లో విషాదం అలముకుంది...
హోషియార్‌పూర్: పంజాబ్ రాష్ట్రంలోని హోషియార్‌పూర్ జిల్లాలో గురువారం జరుగుతున్న బైసాఖీ వేడుకల్లో విషాదం అలముకుంది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో గురువారం ట్రక్కు ఢీకొని ఏడుగురు యాత్రికులు మృతి చెందారు.హోషియార్‌పూర్ జిల్లాలోని ఖురల్‌ఘర్ సాహిబ్ వద్ద బైసాఖీ వేడుకలను జరుపుకునేందుకు వెళుతున్న ఏడుగురు యాత్రికులపై ట్రక్కు దూసుకెళ్లింది.ఈ ఘటనలో మరో పది మంది గాయపడ్డారు.
మరణించిన యాత్రికులు ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని మస్తాన్ ఖేరా నివాసితులని పంజాబ్ పోలీసులు చెప్పారు. మృతులు ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని మస్తాన్ ఖేరా నివాసితులని గర్హశంకర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) దల్జీత్ సింగ్ ఖాఖ్ తెలిపారు.
ఇది కూడా చదవండి : Covid: 24 గంటల్లో 10,158 కరోనా కొత్త కేసులు...10 రోజుల్లో కరోనా తగ్గుముఖం...వైద్యనిపుణుల అంచనా
ప్రమాదం జరిగిన ప్రాంతం పర్వత ప్రాంతం అని, వాలుపై ట్రక్కు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి కాలినడకన వెళుతున్న 17 మంది యాత్రికులను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.ట్రక్కు బ్రేకులు ఫెయిలయ్యాయని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.మృతులను రాహుల్, సుదేష్ పాల్, సంతోష్, అంగూరి, కుంతి, గీత, రామోలుగా గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు.తీవ్రంగా గాయపడిన వారిలో ఐదుగురిని చండీగఢ్ నగరంలోని పిజిఐఎంఇఆర్ కు రిఫర్ చేశారు. మిగిలిన క్షతగాత్రులను గఢ్‌శంకర్‌లోని సివిల్ హాస్పిటల్‌లో చేర్చామని పంజాబ్ పోలీసులు వివరించారు.
Updated Date - 2023-04-13T11:49:33+05:30 IST