ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cheetah : కునూ నేషనల్ పార్క్‌లో విషాదం.. నాలుగు నెలల్లో ఎనిమిదో చిరుత మృతి..

ABN, First Publish Date - 2023-07-14T16:09:42+05:30

వన్య ప్రాణులను కాపాడటం కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. చిరుత పులుల జాతి అంతరించిపోకుండా పరిరక్షించేందుకు అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ, సత్ఫలితాలు కనిపించడం లేదు. మధ్య ప్రదేశ్‌లోని కునూ నేషనల్ పార్క్‌లో నాలుగు నెలల్లోనే ఎనిమిది చిరుత పులులు ప్రాణాలు కోల్పోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ : వన్య ప్రాణులను కాపాడటం కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. చిరుత పులుల జాతి అంతరించిపోకుండా పరిరక్షించేందుకు అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ, సత్ఫలితాలు కనిపించడం లేదు. మధ్య ప్రదేశ్‌లోని కునూ నేషనల్ పార్క్‌లో నాలుగు నెలల్లోనే ఎనిమిది చిరుత పులులు ప్రాణాలు కోల్పోయాయి. పుట్టిన చిరుతల్లో 90 శాతం వరకు తక్కువ వయసులోనే మరణిస్తాయని నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ, అభయారణ్యంలో పరిరక్షణలో ఉన్న చిరుత పులులు వరుసగా మరణిస్తుండటం అత్యంత విషాదకరం.

కునూ నేషనల్ పార్క్‌లో శుక్రవారం ఉదయం ఆఫ్రికన్ చీతా సూరజ్ (మగ) నిర్జీవంగా కనిపించింది. గడచిన నాలుగు నెలల్లో ప్రాణాలు కోల్పోయిన చిరుత పులుల్లో ఇది ఎనిమిదోది. సూరజ్ మరణానికి కారణాలను తెలుసుకుంటామని అధికారులు చెప్పారు.

ఈ పార్క్‌లో ఉంటున్న తేజస్ అనే మగ చిరుత పులి మంగళవారం మరణించింది. ఓ ఆడ చిరుతతో జరిగిన ఘర్షణలో దీనికి తీవ్రమైన షాక్ తగిలిందని, దాని నుంచి అది కోలుకోలేకపోయిందని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది.

మార్చి 27న ఆడ చిరుత పులి సాషా మూత్రపిండాల వ్యాధితో మరణించింది. ఏప్రిల్ 23న ఉదయ్ అనే చిరుత పులి కార్డియో-పల్మనరీ వైఫల్యంతో ప్రాణాలు కోల్పోయింది. మే 9న దక్ష అనే ఆడ చిరుత పులి ఓ మగ చిరుత పులితో సంతానోత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నపుడు మరణించింది. మే 25న రెండు చిరుత పులి పిల్లలు వడగాడ్పుల వాతావరణాన్ని తట్టుకోలేక, డీహైడ్రేషన్‌తో మరణించాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిరుత పులుల సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. తాజాగా సూరజ్ అనే చిరుత పులి మరణించడంతో ప్రభుత్వానికి శరాఘాతం తగిలినట్లయింది. ఆరు చిరుత పులులు మరణించిన అనంతరం కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ, వీటి పెంపకంలో ఎటువంటి లోపాలు జరగలేదన్నారు. చీతాల్లో 90 శాతం వరకు బాల్యంలోనే మరణిస్తాయని వన్యప్రాణులపై జరిగిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయన్నారు. సౌత్ ఆఫ్రికన్ వైల్డ్‌లైఫ్ నిపుణుడు విన్సెంట్ వాన్ డెర్ మెర్వె మే నెలలో మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన చీతాల రీఇంట్రడక్షన్ ప్రాజెక్టులో మరిన్ని చీతాలు మరణించే అవకాశం ఉందని చెప్పారు. చీతాలు తమ సొంత సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించినపుడు పులులు, చిరుత పులులతో జరిగే ఘర్షణల్లో అవి ప్రాణాలు పోగొట్టుకుంటాయన్నారు.

ఇవి కూడా చదవండి :

Modi France Visit : ఫ్రాన్స్‌లో భారతీయ కరెన్సీలో యూపీఐ చెల్లింపులు.. పోస్ట్ స్టడీ వర్క్ వీసాలు.. : మోదీ

Kosovo Parliament : కొసావో పార్లమెంటులో కొట్లాట.. పిడిగుద్దులతో తలపడిన ఆడ, మగ సభ్యులు..

Updated Date - 2023-07-14T16:09:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising