ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jammu and Kashmir : పుల్వామాలో తప్పిన ఘోర ఉగ్ర ముప్పు.. 6 కేజీల ఐఈడీల స్వాధీనం..

ABN, First Publish Date - 2023-05-07T15:33:14+05:30

జమ్మూ-కశ్మీరులోని పుల్వామాలో భారీ ఉగ్ర ముప్పు తప్పింది. దాదాపు 6 కేజీల ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లొసివ్ డివైసెస్ (IEDs)ను స్వాధీనం చేసుకోవడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరులోని పుల్వామాలో భారీ ఉగ్ర ముప్పు తప్పింది. దాదాపు 6 కేజీల ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లొసివ్ డివైసెస్ (IEDs)ను స్వాధీనం చేసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉగ్రవాదంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

కశ్మీరు జోన్ పోలీసులు ఓ ట్వీట్ ద్వారా తెలిపిన వివరాల ప్రకారం, ఉగ్రవాదంతో సంబంధం ఉన్న ఇష్ఫాక్ అహ్మద్ వనీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను వెల్లడించిన వివరాల ఆధారంగా దాదాపు 5 కేజీల నుంచి 6 కేజీల వరకు బరువుగల ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యక్తి పుల్వామా జిల్లాలోని అరిగమ్‌లో నివసిస్తున్నాడు. ఇతనిపై పుల్వామా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

రాజౌరీలోని కంది అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఉగ్రవాద దాడిలో ఐదుగురు భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఓ సైనికాధికారి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రాంతంలో నక్కి ఉన్న ఉగ్రవాదులను శనివారం ఉదయం సైన్యం గుర్తించింది. ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టింది. మరో ఉగ్రవాది గాయపడి, పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.

మూడు రోజుల నుంచి కంది అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు జరుపుతున్నాయి. అయితే ఉగ్రవాదులెవరూ కనిపించలేదని సైన్యం తెలిపింది. శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసినప్పటికీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం రాజౌరీలోని 25 ఇన్‌ఫాంట్రీ డివిజన్‌ను సందర్శించారు. నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం సన్నద్ధతను పరిశీలించారు. అమరులైన సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో కూడా ఎంతో ధైర్యసాహసాలతో పని చేస్తున్నందుకు సైన్యాన్ని ప్రశంసించారు. ఆయనతోపాటు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, జమ్మూ-కశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

Wrestlers Protest : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ రాజీనామా చేయాలి.. రెజ్లర్లకు రైతు నేతల మద్దతు..

Shashi Tharoor: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన: శశిథరూర్ డిమాండ్

Updated Date - 2023-05-07T15:33:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising