Aadhaar, Ration Card: రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానానికి సెప్టెంబరు దాకా గడువు
ABN, First Publish Date - 2023-07-16T11:14:28+05:30
రేషన్‌కార్డుకు ఆధార్ అనుసంధానం(Linking of Aadhaar to Ration Card) చేసే ప్రక్రియ సెప్టెంబరు ఆఖరు దాకా విస్తరింపచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రేషన్‌కార్డుకు ఆధార్ అనుసంధానం(Linking of Aadhaar to Ration Card) చేసే ప్రక్రియ సెప్టెంబరు ఆఖరు దాకా విస్తరింపచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగిన లబ్ధిదారులందరూ ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలనే నిబంధన ఉంది. దాదాపు రెండేళ్లుగా ప్రక్రియ సాగుతోంది. గత జూన్ 30తో గడువు ముగియాల్సి ఉండేది. తాజాగా మరో మూడునెలలు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబరు నెలాఖరు తర్వాత ఎట్టి పరిస్థితిల్లోనూ అనుసంధానం చేసుకునేందుకు వీలు ఉండదని ఉత్తర్వులలో స్పష్టం చేశారు. పీడీఎస్ పోర్టల్ ద్వారా ఆధార్ కార్డును రేషన్ కార్డుకు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
Updated Date - 2023-07-16T11:14:28+05:30 IST