ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Aaj Tak: 5 కోట్లమంది సబ్‌స్క్రైబర్లతో.. ప్రపంచంలో తొలి యూట్యూబ్ చానల్‌గా ఆజ్‌‌తక్

ABN, First Publish Date - 2023-02-03T19:57:10+05:30

ప్రముఖ హిందీ న్యూస్ చానల్ ఆజ్‌‌తక్ (Aaj Tak) యూట్యూబ్ చానల్ రికార్డులకెక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ హిందీ న్యూస్ చానల్ ఆజ్‌‌తక్ (Aaj Tak) యూట్యూబ్ చానల్ రికార్డులకెక్కింది. 5 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో ప్రపంచంలోనే ఆ ఘనత సాధించిన తొలి చానల్‌గా అవతరించింది. 5 కోట్లమంది సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకున్న మొట్టమొదటి న్యూస్ చానల్‌గా రికార్డులకెక్కింది. 2019లో 10 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్ల మార్కును దాటిన ఆజ్‌తక్ మూడేళ్లలోనే 5 కోట్లకు చేరుకోవడం విశేషం. అత్యంత అరుదైన ఘనత సాధించినందుకు ఆజ్‌తక్ యూట్యూబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ సుపాన్ వోజ్‌కికి(Susan Wojcicki) న్యూస్ టీంను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా ఆజ్ తక్ యూట్యూబ్ సీపీవో నీల్ మోహన్ మాట్లాడుతూ.. యూట్యూబ్‌లో 50 మిలియన్ల సబ్‌స్క్రైబర్ల మైలురాయిని అధిగమించిన మొదటి న్యూస్ చానల్‌గా ఆజ్ తక్ నిలిచిందని, ఈ సందర్భంగా తమ బృందానికి అభినందనలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.

ఆజ్ తక్ 2009లో యూట్యూబ్ చానల్ ప్రారంభించి డిజిటల్ జర్నీ ప్రారంభించింది. 2017లో తొలిసారి యూట్యూబ్‌లోనూ ప్రత్యక్ష ప్రత్యక్ష ప్రసారాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2019లో 10 మిలియన్ సబ్‌స్క్రైబర్ల మైలురాయిని అధిగమించింది. ఫలితంగా డైమండ్ ప్లే బటన్‌ను అందుకుంది. ఇప్పుడు 50 మిలియన్ సబ్‌స్క్రైబర్లను దాటేసి ఆ ఘనత సాధించిన తొలి న్యూస్ చానల్‌గా అవతరించింది.

Updated Date - 2023-02-03T19:57:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising