ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Arvind Kejriwal: పార్టీ రాష్ట్ర విభాగాలను రద్దు చేసిన కేజ్రీవాల్

ABN, First Publish Date - 2023-10-22T17:40:52+05:30

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పార్టీ విభాగాలన్నింటినీ రద్దు చేశారు. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్ర విభాగాలను రద్దు చేశామని, వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని ఆ ప్రకటనలో తెలిపింది.

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని పార్టీ విభాగాలను రద్దు చేశారు. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్ర విభాగాలను రద్దు చేశామని, వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని ఆ ప్రకటనలో తెలిపింది. ఇంతవరకూ చేసిన సేవలకు గాను పార్టీ ఆఫీస్ బేరర్లకు కృతజ్ఞతలు తెలిపింది. త్వరలోనే కొత్త ఆఫీస్ బేరర్లను ప్రకటించనున్నట్టు పేర్కొంది.


ఉత్తరాఖండ్ ఆప్ విభాగం

2002 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికి చాటుకోలేకపోవడంతో పార్టీ యూనిట్లను రద్దు చేయాల్సి వచ్చింది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ 49 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 19 సీట్లు సాధించింది. బీఎస్‌పీ 2 సీట్లు కైవసం చేసుకుంది. ఆప్ ఖాతా తెరవలేదు.

Updated Date - 2023-10-22T17:40:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising