AC buses: ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితీ రద్దు

ABN, First Publish Date - 2023-04-19T08:55:00+05:30

వేసవి సీజన్‌ ప్రారంభం కావటంతో రాష్ట్ర రవాణా సంస్థ ఏసీ బస్సుల్లో ఇప్పటివరకూ చార్జీల్లో కల్పిస్తున్న 10 శాతం రాయితీని

AC buses: ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితీ రద్దు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రూ.50 నుంచి రూ.125 వరకు పెరగనున్న చార్జీలు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): వేసవి సీజన్‌ ప్రారంభం కావటంతో రాష్ట్ర రవాణా సంస్థ ఏసీ బస్సుల్లో ఇప్పటివరకూ చార్జీల్లో కల్పిస్తున్న 10 శాతం రాయితీని రద్దు చేసింది. దీంతో ఏసీ బస్సుల్లో(AC buses) చార్జీలు రూ.50 నుండి రూ.125 వరకు పెరిగాయి. ఇప్పటికే ఇది అమలులోకి వచ్చింది. జూన్‌ 15 వరకు ఈ చార్జీల పెంపు అమలులో ఉంటాయని రవాణా సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రాష్ట్ర రవాణా సంస్థ వివిధ నగరాలకు 330 ఏసీ బస్సులు నడుపుతుండగా, వీటిలో టాయ్‌లెట్‌ సదుపాయంతో కూడిన బస్సులు, ఏసీతో పాటు స్లీపింగ్‌ సదుపాయం కలిగిన బస్సులు, ఈ రెండు రకాల సదుపాయాలు లేని తక్కువ దూరం ప్రయాణించే ఏసీ బస్సులు ఉన్నాయి. ప్రస్తుతం ఎండవేడిమి అధికంగా ఉండటంతో ఏసీ బస్సులకు డిమాండ్‌ పెరిగింది. దీంతో ఏసీ బస్సు చార్జీలలో కల్పించిన 10 శాతం రాయితీని ప్రభుత్వం రద్దు చేసినట్లు రవాణా శాఖ మంత్రి శివశంకర్‌(Minister Sivashankar) తెలిపారు. వాస్తవానికి ఏసీ బస్సుల చార్జీలను పెంచలేదని, చార్జీలలో కల్పిస్తూ వచ్చిన 10 శాతం రాయితీని మాత్రమే రద్దు చేశామని ఆయన వివరించారు. ఏసీ బస్సుల సంఖ్యను తగ్గించే ప్రసక్తి లేదని కూడా మంత్రి స్పష్టం చేశారు.

ఇదికూడా చదవండి: ఆయన్ను ప్రధాన కార్యదర్శిగా గుర్తించొద్దు

Updated Date - 2023-04-19T08:55:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising