Actor Darshan: భవిష్యత్తులో జాగ్రత్తలు పాటిస్తా.. ఆ కుక్క ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తా..
ABN, First Publish Date - 2023-11-16T12:45:53+05:30
ప్రముఖ నటుడు, చాలెంజింగ్ స్టార్ దర్శన్(Challenging Star Darshan) పోలీసుల ఎదుట హాజరై భవిష్యత్తులో జాగ్రత్తలు
- పోలీసుల ఎదుట నటుడు దర్శన్
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ప్రముఖ నటుడు, చాలెంజింగ్ స్టార్ దర్శన్(Challenging Star Darshan) పోలీసుల ఎదుట హాజరై భవిష్యత్తులో జాగ్రత్తలు పాటిస్తానని, పెంపుడు కుక్క ద్వారా ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. రాజరాజేశ్వరినగర్‌లో నివసించే దర్శన్ పెంపుడు కుక్క ఇదే ప్రాంతానికి చెందిన ఓ మహిళపై దాడి చేసింది. అక్టోబరు 28న అమితా జిందాల్ అనే మహిళ దర్శన్ ఇంటి ముందు ఖాళీస్థలంలో కారు పార్క్ చేశారు. ఓ కార్యక్రమం ముగించుకుని వెను తి రిగి వచ్చేవేళ కుక్కలు ఆమెపై దాడికి ప్రయత్నించాయి. భయపడిన ఆమె కారు చెంతకు పరుగులు దీ శారు. వెంటనే కుక్కలను తీసుకెళ్లాలని సూచించగా ద ర్శన్ ఇంట్లో పనిచేసేవారు ఆమెతో గొడవకు దిగారు. ఇదే సమయంలో దర్శన్ పెంపుడు కుక్క అమితా జిందాల్‌పై దాడి చేసింది. ఈ మేరకు బాధిత మహిళ అమితా జిందాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుక్కలు దాడికి దిగినా వారి మనుషులు నియంత్రించే ప్రయత్నం చేయలేదని, పైగా గొడవ చేశారని బాధిత మహిళ ఆరోపించారు. మూడు రోజుల క్రితమే విచారణకు హాజరు కావాలని రాజరాజేశ్వరినగర్ పోలీసులు నటుడు దర్శన్‌కు సూచించారు. గుజరాత్‌లో షూటింగ్‌లో ఉన్నానని, బెంగళూరు రాగానే హాజరవుతానని తెలిపారు. ఈ మేరకు బుధవారం నటుడు దర్శన్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. కార్ పా ర్కింగ్ విషయంలో గొడవ జరిగిందని వివరణ ఇచ్చారు. మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు పాటిస్తానని హామీ ఇచ్చారు.
Updated Date - 2023-11-16T12:45:54+05:30 IST