Actor Mansoor Ali Khan: కులగణనపై నటుడు మన్సూర్ అలీఖాన్ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-11-12T13:23:47+05:30
బిహార్ రాష్ట్రంలో చేపట్టినట్టుగా తమిళనాడులో కూడా కులగణన చేపట్టాలని ప్రముఖ సినీ నట, దర్శకుడు మన్సూర్ అలీఖాన్(Mansoor Ali Khan)
- నటుడు మన్సూర్ అలీఖాన్
అడయార్(చెన్నై): బిహార్ రాష్ట్రంలో చేపట్టినట్టుగా తమిళనాడులో కూడా కులగణన చేపట్టాలని ప్రముఖ సినీ నట, దర్శకుడు మన్సూర్ అలీఖాన్(Mansoor Ali Khan) కోరారు. నుంగంబాక్కంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నందున బిహార్(Bihar)లో చేపట్టినట్టుగానే రాష్ట్రంలో కూడా కులగణన చేపట్టాలని ఆయన కోరారు. ఇందుకోసం కొందరు ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు కేటాయిస్తే ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చని తెలిపారు. ఈ కులగణన దేశవ్యాప్తంగా చేపట్టాలన్నదే తన ప్రధాన విన్నపం అని తెలిపారు. ఈ కులగణన తర్వాత జనాభా నిష్పత్తి మేరకు ప్రభుత్వ ఉపాధి అవకాశాలు కల్పిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ముఖ్యంగా సుధీర్ఘంగా కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు కొనసాగిస్తున్న ఆధిపత్యానికి చెక్ పెట్టొచ్చన్నారు. ఈ కులగణనను చేపట్టే విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టిసారించాలన్నారు. రూ.4 కోట్లతో బడ్జెట్‌తో సినిమా తీసేందుకు ఎవరూ రావొద్దని హీరో విశాల్(Hero Vishal) చేసిన వినతి తాను ఖండిస్తున్నట్టు చెప్పారు. మంత్రి ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను బూతద్దంలో చూపించి రాష్ట్రంలో కలహాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్టు నటుడు మన్సూర్ అలీఖాన్ తెలిపారు.
Updated Date - 2023-11-12T13:25:25+05:30 IST