Actor Upendra: నటుడు ఉపేంద్ర కేసు విచారణ వాయిదా
ABN, First Publish Date - 2023-08-17T09:54:17+05:30
నటుడు ఉపేంద్ర(Actor Upendra) తనపై దాఖలవుతున్న ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలంటూ హైకోర్టులో వేసిన పిటీషన్‌పై విచారణ

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): నటుడు ఉపేంద్ర(Actor Upendra) తనపై దాఖలవుతున్న ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలంటూ హైకోర్టులో వేసిన పిటీషన్‌పై విచారణ వాయిదా పడింది. సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్‌లకు సంబంధించి ఉపేంద్రపై పలు స్టేషన్‌లలో ఫిర్యాదులు అందుతున్నాయి. ఇంత వరకు తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని ఉపేంద్ర దాఖలు చేసుకున్న పిటీషన్‌పై బుధవారం విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ దీన్ని గురువారానికి వాయిదా వేసినట్టు ఏకసభ్య ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ చందన్‌గౌడర్ ప్రకటించారు.
Updated Date - 2023-08-17T09:54:17+05:30 IST